నందమూరి నటసింహం బాలకృష్ణ తనకి టైలర్ మేడ్ లాంటి ఫ్యాక్షన్ రోల్ లోకి కంబ్యాక్ ఇస్తూ నటిస్తున్న సినిమా ‘వీర సింహా రెడ్డి’. బాలయ్య ఫ్యాన్ అయిన దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు. టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఇలా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ తో అంచనాలు పెంచుతూ వచ్చిన వీర సింహా రెడ్డి సినిమా మరి కొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకి రాబోతోంది. తెలంగాణాలో జనవరి 12 తెల్లవారుఝామున వీర సింహా రెడ్డి సినిమా ఫస్ట్ షో పడనుండగా, ఆంధ్రాలో స్పెషల్ షో విషయంలో ఎలాంతో అప్డేట్ లేదు. ఓవర్సీస్ లో మాత్రం మరి కొన్ని గంటల్లోనే వీర సింహా రెడ్డి ప్రీమియర్స్ పడనున్నాయి. అడ్వాన్స్ సేల్స్ లో వీర సింహా రెడ్డి సినిమా మిగిలిన సంక్రాంతి సినిమాల కన్నా ఎక్కువ హైప్ నే క్రియేట్ చేసింది.
ఓవర్సీస్ లో వీర సింహా రెడ్డి ప్రీమియర్స్ తోనే 500K డాలర్స్ మార్క్ ని రీచ్ అయ్యింది. బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన ప్రీమియర్ షోస్ గా వీర సింహా రెడ్డి పేరు తెచ్చుకుంది. ఇప్పుడున్న హైప్ లో హిట్ టాక్ తోడైతే చాలు బాలయ్య ఓవర్సీస్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబాట్టగలడు. తెలుగు రాష్ట్రాల్లో కూడా వీర సింహా రెడ్డి సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. నైజాం ప్రాంతంలో మొదటి రోజు ఆరు కోట్ల వరకూ రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. అయితే వైజాగ్, గుంటూరు, నెల్లూరు, ఒంగోల్ లాంటి ప్రాంతాల్లో టికెట్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ అవ్వకపోవడంతో వీర సింహా రెడ్డి సినిమాకి ఏపీలో కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంది.