మెగాస్టార్ చిరంజీవి మాస్ మూలవిరాట్ అవతారం ఎత్తి, థియేటర్ లో కూర్చున్న ప్రతి ఒక్కరికీ వింటేజ్ చిరంజీవిని గుర్తు చేసేలా నటించిన మూవీ ‘వాల్తేరు వీరయ్య’. జనవరి 13న ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ అమలాపురం అమెరికా వరకూ బాక్సాఫీస్ ని షేక్ చేస్తూనే ఉంది. C సెంటర్ నుంచి మల్టీప్లెక్స్ వరకూ వాల్తేరు వీరయ్య సినిమా ఆడే ప్రతి థియేటర్ ముందు హౌజ్ ఫుల్ బోర్డ్ పెట్టేస్తున్నారు. రిలీజ్ అయిన పది రోజుల్లోనే వాల్తేరు వీరయ్య సినిమా అన్ని సెంటర్స్ లో హ్యుజ్ ప్రాఫిట్స్ తెస్తుంది అంటే ఆడియన్స్ చిరుని చూడడానికి ఎంత ఉత్సాహం చూపిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. వింటేజ్ మాస్ మెగాస్టార్ కనిపించాడు కాబట్టే ఈరోజుకీ థియేటర్స్ ప్యాక్ అవుతున్నాయి. ఒక మాస్ సినిమాకి లాజిక్స్ వెతకకుండా మ్యాజిక్ మాత్రమే చూడాలి అనే విషయం మర్చిపోయి కొంతమంది ఈ సినిమా రిలీజ్ రోజు 2.25 రేటింగ్స్ ఇచ్చాయి. రేటింగ్స్ చూసి సినిమాకి వెళ్లే వాళ్లు, అదేంటి వాల్తేరు వీరయ్య కూడా ఫ్లాప్ అయ్యిందా అనుకున్నారు కానీ మొదటి షో పడి మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యే సరికి వాల్తేరు వీరయ్య సినిమాని ఏ రేటింగ్స్ ఆపలేకపోయాయి.
ఈ లో రేటింగ్స్ విషయంలో బాసు కూడా హార్ట్ అయినట్లు ఉన్నాడు, ఇటివలే ఓవర్సీస్ ఫాన్స్ తో జూమ్ కాల్ లో మాట్లాడిన చిరు… “కొన్ని వెబ్ సైట్స్ వాల్తేరు వీరయ్య సినిమాకి 2.25 రేటింగ్స్ ఇచ్చాయి. 2.25 అంటే అప్పుడు అర్ధం కాలేదు కానీ ఇప్పుడు అర్ధం అయ్యింది. 2.25 అంటే 2.25 మిలియన్స్ అని, ఈ మూవీ ఓవర్సీస్ లో 2.25 మిలయన్ డాలర్స్ కి రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది” అన్నాడు. తక్కువ రేటింగ్స్ ఇచ్చిన వెబ్ సైట్స్ కి చిరు వేసిన కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడ విశేషం ఏంటంటే రేటింగ్స్ తక్కువ ఇచ్చినంత మాత్రాన ఒక సినిమా ఆడకుండా ఉండడు, అలాగే రేటింగ్స్ ఎక్కువ ఇచ్చినంత మాత్రానా ఇంకో సినిమా హిట్టూ అవ్వదు. ఎండ్ ఆఫ్ ది డే టికెట్ కొనుక్కోని థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ ని ఆ సినిమా ఎంటర్టైన్ చేసిందా, ఆ మూవీ హిట్… ఎంటర్టైన్ చెయ్యలేదా ఆ మూవీ ఫ్లాప్ అంతే. మిగిలిన ఏ విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదు.
Mega Euphoria in USA💥💥💥🤟#WaltairVeerayya#BlockbusterWaltairVeerayya pic.twitter.com/MkcKiRVY0I
— Shloka Entertainments (@ShlokaEnts) January 23, 2023
Check out Mega Interaction Videos 👇#WaltairVeerayya @KChiruTweets#BlockbusterWaltairVeerayya pic.twitter.com/WlU98ijTBe
— Shloka Entertainments (@ShlokaEnts) January 23, 2023