Masooda fame Rahul Yadav Nakka’s next titled Brahma Anandam: సక్సెస్ రేషియో చాలా దారుణంగా ఉన్న ఇండస్ట్రీలలో సినిమా పరిశ్రమ టాప్ ప్లేసులో ఉంటుంది. అయితే ఇలాంటి ఇండస్ట్రీలో కూడా, నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ప్రత్యేకంగా నిలుస్తాడు. ఎందుకంటే ఆయన చేసిన మూడు సినిమాలు మంచి హిట్స్ గా నిలిచాయి. ముందుగా గౌతమ్ తిన్ననూరి సుమంత్ తో కలిసి చేసిన -మళ్లీ రావా, నవీన్ పోలిశెట్టి- స్వరూప్ ఆర్ఎస్జే తో కలిసి చేసిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, కిరణ్ – తిరువీర్ తో కలిసి చేసిన మసూద అటు మంచి పేరుతొ పాటు డబ్బు కూడా తెచ్చిపెట్టాయి. ఇక ఇప్పుడు రాహుల్ తన తదుపరి సినిమాను ఫైనల్ చేశారు. ఎప్పటిలాగే, ఆయన తన స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో చేయబోయే కొత్త ప్రాజెక్ట్‌తో కొత్త దర్శకుడు RVS నిఖిల్‌ని పరిచయం చేయనున్నాడు. రాహుల్ తాజాగా మాట్లాడుతూ సినిమా టైటిల్ బ్రహ్మ ఆనందం అని, ఇది ఒక తాత మరియు అతని మనవడి ప్రయాణంతో కూడిన కామెడీ -ఎమోషనల్ డ్రామా అని అన్నారు.
Saif Ali Khan: సైఫ్అలీఖాన్ సర్జరీ.. చేయకుంటే చేయి పోయేదంటూ కామెంట్స్!
ఇది ఒక సిటీ నుండి మొదలై పెళ్లికి మారుతుందని అన్నారు. గత ఫిబ్రవరి-మార్చిలో తాను మొదట స్క్రిప్ట్‌ని చదివానని, సెప్టెంబర్-అక్టోబర్‌లో సినిమా చేయాలనీ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. ఈ మధ్య నేను ఇతర స్క్రిప్ట్‌లు కూడా చదువుతున్నాను కానీ ఎక్కడో బ్రహ్మానందం స్క్రిప్ట్ కొన్ని కారణాల వల్ల నాకు బాగా ఎటాచ్ అయిందని అన్నారు. నేను నిఖిల్‌కి ఫోన్ చేసి, మనం చాలా మార్పులు చేయాలని చెప్పా, రెండు పాత్రలకూ ఆ క్యారెక్టర్ డెప్త్ ఉండాలి అని సలహా ఇచ్చా, తరువాత కూర్చుని, చర్చించి ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేశానని అన్నారు. రాహుల్ ప్రీ-ప్రొడక్షన్‌లో మునిగిపోయాడని మార్చిలో సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడుని అన్నారు. మార్చి మధ్యలో ప్రారంభమయ్యే రెండు షెడ్యూల్‌లలో చిత్రాన్ని 60 రోజులలోపు పూర్తి చేయాలని భావిస్తున్నానని ఆయన అన్నారు.