Saif Ali Khan opens up on his tricep surgery: దేవర సినిమా షూటింగ్ లో భాగంగా విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ కి గాయాలైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో హుటాహుటిన ఆయన షూటింగ్ నిలిపివేసి బయలుదేరి ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే గాయాలయ్యాయి అనే విషయాన్ని ఖరారు చేస్తూ ఈరోజు ఉదయం దేవర సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే సైఫ్ అలీ ఖాన్ కోలుకోవాలని తాము ఆశిస్తున్నట్లు ట్వీట్ చేసింది. అయితే సైఫ్ అలీ ఖాన్ కి గాయాలయ్యాయి అనే విషయం తెలుసు కానీ ఆయనకు ఎలా గాయాలయ్యాయి? ఎందువల్ల గాయాలయ్యాయి? అనే విషయం మీద క్లారిటీ లేదు. అయితే టాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు సైఫ్ అలీ ఖాన్ కి ఇప్పుడు గాయాలు కొత్తగా కాలేదని తెలుస్తోంది. దేవర షూటింగ్ మొదలుపెట్టిన టైంలోనే యాక్షన్ సన్నివేశాలలో తనకి మోకాలు భుజానికి గాయాలయ్యాయని తెలుస్తోంది. అయితే వాటిని అప్పుడు పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు ఆ గాయాలే తిరగబెట్టినట్టు తెలుస్తోంది.
Vijayendra Prasad: జక్కన్న-మహేష్ సినిమా స్క్రీన్ మీద ఎలా ఉంటుందో ఊహకి కూడా అందదు!
ఈ విషయంలో అశ్రద్ధ చేయడం తగదని హుటాహుటిన ముంబైలోని కొకిలాబెన్ ఆసుపత్రిలో చేరారట. అక్కడ ట్రైసప్(కండ) సర్జరీ కచ్చితంగా చేయాలని డాక్టర్లు సూచించడంతో ఇప్పుడు ఆ శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. నటుడు సైఫ్ అలీ ఖాన్ ట్రైసెప్ సర్జరీ చేయించుకుని ఈరోజు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కానున్నారు. అయితే, నటుడు ఎట్టకేలకు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ శస్త్రచికిత్స గురించి వెల్లడించారు. ఈ గాయం ఎంత తీవ్రంగా ఉందో తనకు నిజంగా తెలియదని, అయితే ‘దేవర’ కోసం యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు, మళ్లీ గాయపడ్డానని చెప్పాడు. నొప్పి తీవ్రమైంది, కానీ బాగానే ఉన్నా అని షూట్ చేశానని తరువాత నొప్పి ఇంకా పెరగగా MRI చేయించుకున్నానని అప్పుడే సర్జరీ అవసరం అని తెలిసిందని అన్నారు. ఈ సర్జరీ సకాలంలో చేయకపోతే, తన చేతిలో కొంతభాగాన్ని కూడా కోల్పోయే వాడినని అన్నారు. వైద్యులు తెలివైనవారని ఎముకలో కొన్ని కోతలు చేసి, ఎముకలో కలిసిపోయే పదార్థంతో చేతిని సంపూర్ణంగా నయం చేస్తారని ఆయన వెల్లడించారు. ఇప్పుడయితే సీరియస్‌గా ఏమీ లేదని, త్వరలోనే డిశ్చార్జి అవుతానని చెప్పారు. పూర్తిగా కోలుకోవడానికి ఒక నెల సెలవు తీసుకోవాలని అన్నారు.