మూవీ ఆరిస్ట్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ నిన్న హైదరాబాద్ ఉత్కంఠభరితంగా జరిగాయి. పోటాపోటీగా జరిగిన ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ‘మా’ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. అక్టోబర్ 10 ఉదయం నుంచి ప్రారంభమైన ఈ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగగా, సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ మొదలైంది. క్షణక్షణం ఉత్కంఠను రేపుతూ రాత్రి 9 గంటల వరకూ జరిగిన కౌంటింగ్ లో మంచు విష్ణు విజేతగా నిలిచారు. ఇక ఈ సందర్భంగా చిరంజీవి, మోహన్ బాబు వంటి సీనియర్ హీరోలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
Read Also : “మా”కు మెగా బ్రదర్ రాజీనామా
కొత్తగా ‘మా’ ప్రెసిడెంట్ పదవి దక్కించుకున్న మంచు విష్ణు తన విజయం గురించి ట్వీట్ చేశారు. “శుభోదయం! నా సినిమా సోదరులు నాకు చూపించిన ప్రేమ, సపోర్ట్ కు నేను వినయపూర్వకంగా ఉన్నాను. ‘మా’ ఎన్నికలపై ఇంకా ఏదైనా చెప్పే ముందు ఇసి సభ్యులు, జాయింట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ పోస్టులలో ఒకదానికి ఈ రోజు ఉదయం 11 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మాట్లాడతా!” అని అన్నారు.