“మా”కు మెగా బ్రదర్ రాజీనామా

“మా” మెగా బ్రదర్ నాగబాబు రాజీనామా చేశారు. నిన్న జరిగిన ‘మా’ అధ్యక్ష పదవికి హీరో మంచు విష్ణు, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ పోటీ చేశారు. ఇరు ప్యానళ్ల మధ్య హోరాహోరి జరిగిన పోటీలో ఎట్టకేలకు మంచు విష్ణు విజయపతాకం ఎగరేసి ‘మా’ అధ్యక్ష పదవిని చేపట్టారు. అయితే విష్ణు ప్యానల్ భారీ మెజార్టీ ఓట్లతో గెలవడానికి ముఖ్యకారణం ప్రాంతీయవాదం అని చెప్పొచ్చు. మంచు విష్ణు ప్యానల్ సభ్యులు లోకల్, నాన్ లోకల్ అనే ప్రాంతీయ విభేదతను వ్యతిరేకిస్తూ ప్రచారం చేసుకున్నారు. ‘మా’ సభ్యులు కూడా అదే కోరుకున్నారు. అందుకే విష్ణుకు ‘మా’ అధ్యక్షుడిగా పట్టం కట్టారు.

Read also : సినిమా బ్రతకాలంటే ప్రజలు థియేటర్లో చూడాలి…

అయితే ఈ ఫలితాలు మెగా కాంపౌండ్ కు నిరాశను కలిగించినట్టుగా కన్పిస్తోంది. మెగా ఫ్యామిలీ సపోర్ట్ ప్రకాష్ రాజ్ కే అని ఎన్నికల ముందే ప్రకటించారు మెగా బ్రదర్ నాగబాబు. దీంతో ఎప్పటిలాగే గెలుపు మెగా సపోర్ట్ ఎవరికో వాళ్లదే అని అనుకున్నారు అంతా. అలా అనుకున్న వాళ్లకు నిన్న రాత్రి వచ్చిన ఫలితాలు షాక్ ఇచ్చాయని చెప్పొచ్చు. ఈ పరిణామంతో ‘మా’కు రాజీనామా చేస్తున్నాను అంటూ నాగబాబు ప్రకటించారు. “ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వం తో కొట్టు-మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొనసాగడం నాకు ఇష్టం లేక “మా” అసోసియేషన్లో “నా” ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను… సెలవు – నాగబాబు” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నాగబాబు.

-Advertisement-"మా"కు మెగా బ్రదర్ రాజీనామా

Related Articles

Latest Articles