నిన్న ఉత్కంఠభరితంగా సాగిన ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలుపొందారు. విష్ణుకి వ్యక్తిరేకంగా పోటీ చేసి ఓడిపోయిన ప్రకాష్ రాజ్ ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ ‘మా’ సభ్యులు ప్రాంతీయత కారణంగా తెలుగు వాళ్లే అధ్యక్షుడు అవ్వాలని నిర్ణయించారని, వాళ్ల నిర్ణయాన్ని గౌరవిస్తానని, కానీ తనకు ఆత్మ గౌరవం ఉందని, ఇకపై మా అసోసియేషన్ లో మెంబర్ గా ఉండబోనని, ఇది నొప్పితో తీసుకున్న నిర్ణయం కాదని వెల్లడించారు. తన నిర్ణయానికి…
మూవీ ఆరిస్ట్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ నిన్న హైదరాబాద్ ఉత్కంఠభరితంగా జరిగాయి. పోటాపోటీగా జరిగిన ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ‘మా’ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. అక్టోబర్ 10 ఉదయం నుంచి ప్రారంభమైన ఈ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగగా, సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ మొదలైంది. క్షణక్షణం ఉత్కంఠను రేపుతూ రాత్రి 9 గంటల వరకూ జరిగిన కౌంటింగ్ లో మంచు విష్ణు విజేతగా నిలిచారు. ఇక ఈ సందర్భంగా చిరంజీవి,…
నూతన ‘మా’ అధ్యక్షుడికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్ 10న ఉదయం జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో ‘మా’ అధ్యక్ష పదవికి సంబంధించిన ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మా అధ్యక్ష పదవికి పోటీ చేశారు. నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం 3 వరకు కొనసాగిన పోలింగ్ కేంద్రం వద్ద హైడ్రామా నడిచింది. ఇరు ప్యానల్ ల సభ్యులు ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. పోలింగ్ కేంద్రంలోనూ అసభ్యకర భాషలో…