సర్కారు వారి పాటతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ బాబు.. ప్రస్తుతం ఆ సక్సెస్‌ను యూరప్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ట్రిప్ నుంచి తిరిగొచ్చిన తర్వాత.. త్రివిక్రమ్ సినిమాతో బిజీగా మారనున్నాడు మహేష్. ఇక ఈ సినిమా త్రివిక్రమ్ స్టైల్లో ఓ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రాబోతోందని తెలుస్తోంది. అంతేకాదు ఇందులో మహేష్‌ని గడ్డంతో చూపించబోతున్నాడని.. ప్రస్తుతం మహేష్ గడ్డం పెంచే పనిలో వున్నాడని చర్చ జరుగుతోంది. ఇప్పటికే మహేష్ లుక్ కోసం ఓ ప్రముఖ స్టైలిస్ట్‌ని రంగంలోకి దింపినట్టు టాక్. మొత్తంగా ఈ సినిమాలో మహేష్ అభిమానులు ఆశించే అన్ని అంశాలూ వుంటాయని.. అలాగే సోషల్ మెసేజ్‌తో రాబోతోందని సమాచారం. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ సినిమాలో మహేష్ లుక్ ఇదేనని.. సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.
రీసెంట్‌గా మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని పదో తరగతి పూర్తి చేశాడు. ఈ విషయాన్ని మహేష్, నమ్రత దంపతులు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ‘జర్మనీలో గౌతమ్ హై స్కూల్ గ్రాడ్యుయేషన్ సెలబ్రేట్ చేస్తున్నాం.. గౌతమ్ ను చూస్తే గర్వంగా ఉంది’ అని మహేష్ బాబు పేర్కొన్నారు. అంతేకాదు ఓ సెల్ఫీ కూడా పోస్ట్ చేశారు. ఇందులో మహేష్ కాస్త గడ్డంతో.. రఫ్ లుక్‌లో దర్శనమిచ్చాడు. దాంతో ఈ లుక్ త్రివిక్రమ్ సినిమా కోసమేనని.. అందుకే మహేష్ కొత్తగా గడ్డంతో కనిపించాడని ప్రచారం జరుగుతోంది. అయితే నిజంగానే త్రివిక్రమ్ సినిమాలో మహేష్ ఇదే లుక్‌లో కనిపిస్తాడా.. లేక మరో కొత్త లుక్‌తో స్టైలిష్‌గా దర్శనమిస్తారా.. అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో మహర్షి సినిమా తర్వాత.. మరోసారి మహేష్‌తో రొమాన్స్ చేయబోతోంది పూజా హెగ్దే. అలాగే మరో హీరోయిన్‌కు కూడా స్కోప్ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ మిగతా నటీనటులను ఫైనల్ చేసే పనిలో ఉన్నట్టు టాక్. ఏదేమైనా.. ఈ సారి మహేష్ ఎలాంటి గెటప్‌తో కనిపించబోతున్నాడనేది.. ఇంట్రెస్టింగ్‌గా మారింది.