టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నారా.. అంటే ఔననే వినిపిస్తోంది ఇండస్ట్రీ వర్గాల్లో. ఇప్పటి వరకు స్టార్ హీరోల సినిమాలకు వాయిస్ అందించిన మహేష్.. ఈ సారి మాత్రం అథితి పాత్రలో మెరవబోతున్నాడట. అది కూడా ఓ కోలీవుడ్ స్టార్ హీరోలో సినిమాలో అని తెలుస్తోంది. అయితే మహేష్ ఫ్యాన్స్ అందుకు ఒప్పుకుంటారా.. అనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఏంటా ప్రాజెక్ట్.. మహేష్ గెస్ట్ రోల్ నిజమేనా..!
సర్కారు వారి పాటతో సాలిడ్ హిట్ అందుకున్న మహేష్ బాబు.. త్వరలోనే త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌లో జాయిన్ అవబోతున్నాడు. ఆ తర్వాత రాజమౌళి సినిమా కోసం.. దాదాపు రెండేళ్ల సమయాన్ని కేటాయించనున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా మహేష్ ఓ సినిమాలో గెస్ట్ రోల్‌లో కపించబోతున్నాడనే వార్త వైరల్‌గా మారింది. అది కూడా తన ఫ్యాన్స్‌కు ఏ మాత్రం పడని హీరో అని తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌కి, మహేష్ బాబు మధ్య ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కానీ గతంలో విజయ్ చేసిన రీమేక్ సినిమాల వల్ల.. ఈ ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో తరచుగా వాదించుకుంటునే ఉంటారు. రీసెంట్‌గా సర్కారు వారి పాట, బీస్ట్ సినిమాల విషయంలోను ట్విట్టర్ వార్ జరిగింది. అలాంటిది ఇప్పుడు మహేష్ బాబు.. విజయ్ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాడని వినిపిస్తోంది. ప్రస్తుతం విజయ్ 66వ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలోనే మహేష్ ఓ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో మహేష్‌కు మహర్షి లాంటి బ్లాక్‌బ్లస్టర్ హిట్ ఇచ్చిన వంశీకి.. మహేష్‌తో మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే విజయ్ సినిమాలో గెస్ట్ పాత్రకు ఒప్పించే పనిలో ఉన్నాడట వంశీ పైడిపల్లి. అయితే ఇప్పటి వరకు విజయ్ సినిమాలో మహేష్ గెస్ట్ రోల్ గురించి ఎలాంటి ప్రకటన లేదు. కానీ ఈ క్రేజి బజ్ మాత్రం ఇంట్రెస్టింగ్ మారింది. అయితే మహేష్ నిజంగానే గెస్ట్ రోల్ చేస్తే.. ఆయన అభిమానులు ఎంతవరకు ఒప్పుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇదే నిజమైతే.. కోలీవుడ్, టాలీవుడ్ సూపర్ స్టార్స్ ఇద్దరు ఒకే తెరపై కనిపిస్తే.. ఆ కిక్కే వేరని చెప్పొచ్చు.