కోలీవుడ్ హీరో విశాల్ కి మద్రాసు హైకోర్టు లో చుక్కెదురయ్యింది. లైకా ప్రొడక్షన్ సంస్థ కేసు విషయంలో విశాల్‌కు కోర్టు షాకిచ్చింది. అంతేకాకుండా మూడు వారాల్లో రూ.15 కోట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వద్ద హీరో విశాల్ ‘వీరమే వాగౌ సుడుం’ కోసం రూ.15 కోట్ల రుణాన్ని తీసుకున్నారు. సినిమా పూర్తిచేసి, విడుదల చేసినా ఇంకా ఆ రుణాన్ని విశాల్.. సదురు సంస్థకు తిరిగి చెల్లించలేదు. దీంతో లైకా సంస్థ.. విశాల్ ఫై కోర్టులో కేసు వేసింది.
ఈ క్రమంలో ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఇరు వర్గాల వాదనలు ఆలకించిన తర్వాత రూ.15 కోట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలంటూ హీరో విశాల్ కు ఆదేశాలు జారీ చేసింది. అయితే తమకు విశాల్ నుంచి వడ్డీతో సహా రూ.21.69 కోట్ల రుణాన్ని ఇవ్వాల్సి ఉందని, మొత్తం రుణాన్నిఇప్పించవల్సిందిగా లైకా ప్రొడక్షన్స్ కోరింది. ఇక ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు. ఇక ఈ సినిమానే తెలుగులో సామాన్యుడు పేరుతో రిలీజ్ అయ్యింది.