Leo: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష జంటగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లియో. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నా రెడీనా అంటూ సాగిన ఈ సాంగ్ ఎన్ని వివాదలకు దారితీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా లియో నుంచి సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. బ్యాడ్ యాస్ మా.. లియో దాస్ మా అంటూ సాగే సాంగ్ ను మేకర్స్ రేపు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
Jailer 2: జైలర్ 2 మొదలు.. అడ్వాన్స్ గా రూ. 55 కోట్లు అందుకున్న డైరెక్టర్..?
ఊర మాస్ అవతారంలో విజయ్ కనిపించాడు. పెద్ద కత్తి ఒక చేత్తో పట్టుకొని.. ఇంకో చేత్తో ఆ కత్తి పదునును చూస్తూ విజయ్ కనిపించాడు. లోకేష్, విజయ్, అనిరుధ్ కాంబో ఎలా ఉంటుందో మాస్టర్ సినిమాలో చూసాం. ఇక మరోసారి ఈ కాంబో లియోతో రిపీట్ అవుతుంది. అందుకే ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఈ సాంగ్ కనుక హిట్ అయ్యిందంటే.. మ్యూజిక్ తో అనిరుధ్ మ్యాజిక్ చేస్తే.. సగం సినిమా హిట్ అందుకున్నట్లే.. మరి ఈ సాంగ్ రేపు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.