Jailer 2: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. ప్రతి సినిమా క్లైమాక్స్ లో సీక్వెల్ ఉన్నట్లు హింట్ ఇచ్చి వదిలేస్తున్నారు. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు సీక్వెల్ ప్రకటించి ఆ సినిమాకు ఉన్న బజ్ ను వాడుకోవచ్చని మేకర్స్ ప్లాన్. ఇక ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది హిట్ అయిన చాలా సినిమాలు సీక్వెల్ ను ప్రకటించే పనిలో ఉన్నాయి. ఇక ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న జైలర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసంరం లేదు. రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 10 న రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. రికార్డ్ కలక్షన్స్ అందుకొని రజినీ సత్తా ఏంటో చూపించింది. ఇక ఈ సినిమా చివర్లో కన్నకొడుకు తప్పు చేసినా వదలకుండా రజినీ కాల్చి చంపేస్తాడు. ఆ తరువాత మళ్లీ నార్మల్ లైఫ్ ను గడపడం మొదలుపెడతాడు. ఇక్కడితో ఈ సినిమా అయిపోయింది. అయితే నెల్సన్ చాలా ఇంటర్వూస్ లో జైలర్ కు సీక్వెల్ ఉంటుందని చెప్పడంతో.. జైలర్ 2 ఉన్నా కూడా ఇప్పుడప్పుడే తెరపైకి రాదనీ చెప్పుకొచ్చారు.
Vijay: జవాన్ పై ప్రశంసలు కురిపించిన విజయ్..
ఇక జైలర్ తరువాత నెల్సన్.. ఒక తెలుగు హీరోతో సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. కానీ, అది వర్క్ అవుట్ కాకపోవడంతో.. జైలర్ 2 ను వెంటనే సెట్స్ మీదకు తీసుకురావడానికి పనులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు గాను నెల్సన్ కు సన్ పిక్చర్స్ రూ. 55 కోట్లు అడ్వాన్స్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం ఇది అడ్వాన్స్ మాత్రమే అని.. సినిమా రిలీజ్ అయ్యాకా .. భారీ మొత్తంలో డబ్బు అందుకొనేలా నిర్మాతలు- డైరెక్టర్ మధ్య ఒప్పందం కూడా జరిగిందని తెలుస్తోంది. ఇది కనుక నిజమైతే.. త్వరలోనే జైలర్ 2 పట్టాలెక్కనుంది. ఈసారి తలైవాను నెల్సన్ ఏ రేంజ్ లో చూపిస్తాడో చూడాలి.