మహేష్ బాబు గుంటూరు కారం నుంచి వస్తున్న అప్‌డేట్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. మూవీపై మరింత హైప్ పెంచుతున్నాయి. ఈ క్రమంలో వచ్చిన కుర్చీ మడతపెట్టి సాంగ్ ప్రోమో వీపరితమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ఫుల్ మాస్ సాంగ్‌గా వస్తోన్న పాటకు కోసం మహేష్ ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తు్న్నారు. ఈ ప్రోమోలో మహేశ్‌బాబు, శ్రీలీల ఊరమాస్ స్టెప్పులతో థియేటర్లో మోత మోగించడం ఖాయమనిపిస్తోంది. మరోవైపు ఈ సాంగ్‌పై భిన్నాభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
Also Read: Sai Pallavi: బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తున్న సాయి పల్లవి.. ఫుల్ ఖుష్‌లో ఫ్యాన్స్
ఫ్యాన్స్ పిచ్చెక్కిస్తున్న పాట.. కాస్తా కాంట్రవర్సీకి దారితీసింది. ఊరమాస్ మహేష్‌ను సినీ ప్రియులు చూడలేకపోతున్నారు. ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉన్న మహేశ్ బాబుకు ఇలాంటి ఊరమాస్ సాంగ్ పెట్టడమేంటని, అసలు ఇలాంటి పాటను ఆయనెల అంగీకరించాడంటూ చర్చించుకుంటున్నారు. అలాగే పాట ఓనర్ కుర్చీ తాత గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో పలు చానళ్లను కుర్చీ తాతను ఇంటర్య్వూలో చేసి కుర్చి మడత సాంగ్‌పై ఆయన అభిప్రాయాన్ని అడుగుతున్నారు.
నిజానికి ఈ పాటకు ఈ రేంజ్‌లో రెస్పాన్స్ రావడానికి కారణం కుర్చీ తాతనే. కుర్చీ తాత సరదాకి ‘కుర్చీ మడతపెట్టి’ అనే డైలాగ్ చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాడు. ఇక ఈ డైలాగ్‌ను హుకప్ లైన్ గా తీసుకుని రామజోగయ్య శాస్త్రి గుంటూరు కారంలో ఏకంగా పాటనే రాసేశాడు. అయితే తన డైలాగ్‌ను గుంటూరు కారం సాంగ్‌లో పెట్టడంపై తాజాగా కుర్చీ తాత స్పందించాడు. గుంటూరు కారంలో నా డైలాగ్‌తో రాసిన పాటను మహేశ్‌బాబు పాడి డ్యాన్స్ చేయడం చాలా సంతోషంగా ఉందని, అంత గొప్ప నటుడు తన డైలాగ్‌కు పాట రూపంలో డాన్స్ చేయడం ఆనందంగా ఉందన్నారు.
Also Read: World’s Richest Women: ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళ.. 100 బిలియన్ డాలర్ల విలువైన సామ్రాజ్యాధిపతి
జనవరి 12న గుంటూరు కారం రిలీజ్ అవుతుంది. ఇంకా సినిమా విడుదలకు రెండు వారాల టైం మాత్రమే ఉంది. ఒకవేళ అవకాశం ఇస్తే మహేష్ బాబుతో కలిసి ఆ పాటకు డాన్స్ చేస్తా అని తన కోరికను బయటపెట్టాడు. మరి ఈ కుర్చీ తాత కోరికను మహేష్ తీరుస్తాడో లేదో చూడాలి. ఇదిలా ఉంటే తన డైలాగ్‌ను పాటగా తీసుకున్నందుకు ఈ కుర్చీ తాతకు రెమ్యునరేషన్ కూడా అందినట్టు సమాచారం. ఈ పాటని కంపోజ్ చేసిన తమన్ దాదాపు రూ.5 వేల వరకు కుర్చీ తాతకు రెమ్యునరేషన్ ఇచ్చాడని స్వయంగా ఈ తాతే ఇంటర్వ్యూలో చెప్పాడు.