Kavya Kalyanram: వల్లంకి పిట్ట.. వల్లంకి పిట్ట మెల్లంగ రమ్మంటా అంటూ గంగోత్రిలో పిల్లికళ్ళతో మెప్పించిన బాలనటి కావ్య కళ్యాణ్ రామ్. ఇక బాలనటిగా మంచి హిట్ సినిమాల్లో నటించిన కావ్య.. ఇప్పుడు హీరోయిన్ గా మారింది. మసూద సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక బలగం సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇంకోపక్క సోషల్ మీడియాలో సైతం కావ్య తన హాట్ హాట్ ఫోటోషూట్స్ తో ప్రేక్షకులను పిచ్చెక్కిస్తోంది. ఇప్పుడిప్పుడే కుర్ర హీరోల సరసన నటిస్తున్న కావ్యకు ముందు ముందు సీనియర్ హీరోల సరసన నటించే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కావ్య.. అల్లు అర్జున్ తో హీరోయిన్ గా చేసే అవకాశాన్ని వద్దు అనుకున్నదట. ఏంటి .. నిజమా.. ? ఏ సినిమాలో హీరోయిన్ గా అనుకున్నారు.. అని కంగారు పడకండి. అదంతా ఇప్పుడు కాదు తన చిన్నప్పుడు.. గంగోత్రి సినిమా సమయంలో.. అవును. అప్పుడే బన్నీ.. పెద్దయ్యాక నా పక్కన హీరోయిన్ గా నటిస్తావా .. ? అంటే మరో మాట లేకుండా నో అని చెప్పిందట. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్నీ కావ్య చెప్పుకొచ్చింది.
Mahesh Babu: నేను వెకేషన్ కు వెళ్తే వారికి నచ్చాల్సిందేముంది.. మహేష్ స్ట్రాంగ్ కౌంటర్
” గంగోత్రి సినిమాకు రాఘవేంద్రరావు గారు.. నా కళ్లు చూసి సెలెక్ట్ చేశారు. అప్పుడు సినిమా, షూటింగ్ ఇవేమి తెలిసేవి కాదు. ఆడుకోవడానికి సెట్ కు వెళ్లేదాన్ని, చాక్లెట్ ఇచ్చేవారు.. వాళ్లు చెప్పింది చేసేదాన్ని. ఇక సెట్ లో షాట్ అవ్వగానే బన్నీ.. నాతో ఆడుకొనేవారు. అలా.. ఒకసారి.. పెద్దయ్యాక నా పక్కన హీరోయిన్ గా చేస్తావా అని అడిగాడు. అందుకు నేను.. అప్పటికీ మీరు ముసలి వాళ్ళు అయిపోతారు.. నేను హీరోయిన్ గా చేయను అని చెప్పాను. ఇప్పుడు నేను పెద్దదాన్ని అయ్యాను.. కానీ, బన్నీ మాత్రం అలాగే ఉన్నాడు” అంటూ నవ్వేసింది. ఇది కావ్య హీరోయిన్ కథ. మరి ఇప్పుడు బన్నీ పక్కన హీరోయిన్ చేయను అని అయితే చెప్పదు.. అయితే ఆ అవకాశం మాత్రం వస్తుందా.. ? రాదా అనేది తెలియాలి.