Kaushal Manda right movie pre release event: మణి దీప్ ఎంటర్టైన్మెంట్ పతాకం పై కౌశల్ మంద, లీషా ఎక్లైర్స్ హీరో హీరోయిన్లుగా శంకర్ దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “రైట్” తెరకెక్కించారు. మలయాళంలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో విడుదలై విజయవంతమైన ‘మెమోరీస్’ చిత్రాన్ని తెలుగులో నిర్మాతలు లుకలాపు మధు, మహంకాళి దివాకర్ లు సంయుక్తంగా రీమేక్ గా నిర్మించారు. డిసెంబర్ 30న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేయగా మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో కౌశల్ మాట్లాడుతూ.., నటుడిగా మంచి పేరు సంపాదించాలని 18 ఏళ్ల వయసులో రాజ కుమారుడు సినిమాతో పరిశ్రమకు వచ్చానని గుర్తు చేసుకున్నారు. 24 ఏళ్ల తరువాత బిగ్ బాస్ రూపంలో తనకు కలసి వచ్చిందని, తన కోసం ఒక ఆర్మీ తయారు కావడం అదృష్టం అన్నారు.
PVR INOX: సౌత్ లో రచ్చ రేపే ఆఫర్ తో దిగుతున్న పీవీఆర్.. వింటే సినిమాలకి వెళ్లకుండా ఆగలేరు!
తన ఆర్మీ అందరినీ కలుసుకోవడానికి దాదాపు 8 నెలలు అన్ని ప్రాంతాలు తిరిగానని, ఆ సమయంలో తన ఫ్యాన్స్ తనని హీరోగా చూడాలనే కోరిక వ్యక్తం చేయడంతో హీరోగా వస్తున్నా, తాత గారు ఆంధ్ర నాట్య మండలిలో ఎస్ వీ రంగారావు, జగ్గయ్య, అల్లు రామలింగయ్య వంటి మహా మహులతో కలిసి నాటకాలు, పరిషత్ లు చేశారు. అంతేకాకుండా తన తండ్రి 8 సార్లు ఆల్ ఇండియా బెస్ట్ యాక్టర్ గా నిలిచినా గుర్తింపు రాలేదు.. కానీ ఫ్యాన్స్ ఆదరణతో నాకు మంచి గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. రీమేక్ రైట్స్ తీసుకున్న తర్వాత మొదటి సిట్టింగ్ లోనే ఈ సినిమా తనతోనే చేస్తానని దర్శకుడు శంకర్ తెలిపారని అన్నారు. ఆది సాయి కుమార్ తో కలిసి బ్లాక్ సినిమా చేస్తున్న సమయంలో ఈ సినిమాకు నిర్మాతలు మహంకాళీ దివాకర్, మధులు పచ్చ జెండా ఊపారని కరోనా సమయంలో ఎన్నో ఒడిదుడుకులను దాటుకుని షూటింగ్ పూర్తి చేశాం, ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుందని కౌశల్ తెలిపారు. చిన్నా, పెద్దా అని తేడాలు లేకుండా అందరినీ ప్రోత్సహించే గొప్ప వ్యక్తి మంచు మనోజ్ ఈ కార్యక్రమానికి వచ్చి టీం ను ప్రోత్సహించడం సంతోషంగా ఉందనన్నారు. హీరోగానే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న ఏ పాత్ర అయినా చేయడానికి ఎప్పటికీ సిద్దంగా ఉంటానని ఆయన పేర్కొన్నారు.