Kantara Chapter 1 OTT: బాక్సాఫీసు వద్ద అఖండ విజయాన్ని సాధించిన ‘కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1’ (Kantara Chapter 1) ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. అక్టోబర్ 2న దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకుపైగా వసూళ్లు సాధించి 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాగా నిలిచింది. థియేటర్లలో ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌లపై కూడా చూడబోతున్నారు. అక్టోబర్ 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది ఈ సూపర్ హిట్ సినిమా. ఈ చిత్రం భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 200కి పైగా దేశాలు, వివిధ భాషలలోకి అందుబాటులోకి రానుంది. మొదటగా కన్నడ (ఒరిజినల్)తో పాటు తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం ఇంగ్లిష్ వెర్షన్ కూడా అదే రోజున విడుదల కానుంది. అయితే హిందీ వెర్షన్ కోసం మాత్రం అభిమానులు కొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది.
Moto X70 Air: ఆపిల్ ఎయిర్ లాంటి స్లిమ్ స్మార్ట్‌ఫోన్ మోటో X70 ఎయిర్ విడుదల.. కేక పుట్టించే ఫీచర్స్
‘కాంతార చాప్టర్ 1’ కథ విషయానికి వస్తే.. 8వ శతాబ్దపు కదంబుల రాజ్య పాలన నేపథ్యంలో సాగుతుంది. ఇది 2022లో విడుదలైన ‘కాంతార – ఎ లెజెండ్’ సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కింది. ఈ కథ కాంతార ప్రాంతంలోని పంజూర్లి దైవ పురాణ మూలాలను వెలికితీస్తూ, మనిషి, ప్రకృతి మధ్య ఉన్న ఆధ్యాత్మిక బంధాన్ని చక్కగా ఆవిష్కరిస్తుంది. కథలోని ప్రధాన పాత్ర బెర్మే (రిషబ్ శెట్టి) ఒక గిరిజన తెగలో పెరిగిన యువకుడు. అతన్ని ప్రజలు దైవ ప్రసాదంగా భావించి పెంచుతారు. కానీ భాంగ్రా యువరాజు కులశేఖర (గుల్షన్ దేవయ్య) రాజ్యంలోకి చొరబడి గిరిజనుల జీవనాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించినప్పుడు బెర్మే అతనికి ప్రతిఘటిస్తాడు. గిరిజన సంపదపై విదేశీ వ్యాపారుల దురాశ, సామాజిక పోరాటం, విశ్వాసం, ధర్మం ఇవన్నీ ఈ మిథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో అద్భుతంగా మిళితమయ్యాయి.
Film Chamber : ఫిలిం ఛాంబర్ వద్ద సినీ ప్రముఖుల కొవ్వొత్తుల ర్యాలీ..
దర్శకుడు, రచయిత, హీరోగా రిషబ్ శెట్టి తన సృజనాత్మకతను మరోసారి నిరూపించారు. ఆయన కోస్తా కర్ణాటకకు చెందిన భూతకోల సంప్రదాయాన్ని అత్యంత ప్రామాణికంగా తెరపై చూపించారు. సినిమాటోగ్రఫీ, విజువల్ టెక్నిక్స్, అలాగే అజనీష్ లోక్‌నాథ్ అందించిన సంగీతం ఈ సినిమాకు మరో స్థాయి అందించాయి. హోంబాలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమా మనిషి, ప్రకృతి, విశ్వాసం మధ్య ఉన్న పవిత్ర బంధాన్ని ప్రతిబింబిస్తుంది.