Priyanth Rao: చిత్ర పరిశ్రమలో దారుణం చోటుచేసుకొంది. నూతన నటుడు ప్రియాంత్ రావు రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో వంచించి అత్యాచారం చేశాడంటూ ప్రియాంత్‌పై జూనియర్ ఆర్టిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొన్ని నెలలుగా పరారీలో ఉన్న అతడిని పోలీసులు వెతికిపట్టుకున్నారు. అత్యాచారంతో పాటు కులం పేరుతో దూషించాడంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రియాంత్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘కొత్తగా మా ప్రయాణం’ సినిమా తో తెలుగు తెరకు పరిచయమయ్యాడు ప్రియాంత్ రావు. ఈ సినిమా షూటింగ్ లోనే ప్రియాంత్‌కు ఓ జూనియర్ ఆర్టిస్ట్‌తో పరిచయం ఏర్పడింది. పరిచయం అయిన రెండు నెలల తర్వాత ఆమెకు ప్రియాంత్ ప్రపోజ్ చేశాడు. అప్పటి నుంచి వారి ప్రేమ ప్రయాణం కొనసాగింది. ఈ క్రమంలో ఒక రోజు హైదరాబాద్ శివార్‌లో ప్రగతి రిసార్ట్‌కు తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి ఆమెపై అత్యాచారం చేశాడు. ఇక అప్పటి నుంచి ఆమెను శారీరకంగా లొంగదీసుకుంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే బాధితురాలు ప్రెగ్నెంట్ అవ్వడంతో సదురు హీరో మొహం చాటేయడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా అబార్షన్ కోసం మెడిసెన్స్ ఇవ్వడంతో బాధితురాలు ఆరోగ్యం పాడైంది. ఇక ఈ విషయం బయటకు చెప్తే చెప్పేస్తానని బెదిరింపులకు గురిచేస్తుండడంతో ప్రాణభయంతో బాధితురాలు జూలై 9 న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడిని వెతుకుంటుండగా.. తాజాగా అతడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.