టీవీ షోలో అవకాశం ఇప్పిస్తానంటూ యువతి మీద లైంగిక దాడి చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. బస్సులో పరిచయం అయిన మేకప్ ఆర్టిస్ట్ ని ఓ జూనియర్ ఆర్టిస్ట్ నమ్మించాడు. డెమో కోసం అంటూ యూసుఫ్ గూడా లోని ఓయో రూమ్ తీసుకుని వెళ్లి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటా అని పలు మార్లు లైంగిక దాడి చేశాడు.
Junior Artist Karthik: హైదరాబాద్‌లో ఓ జూనియర్ ఆర్టిస్ట్ దారుణ హత్యకు గురయ్యాడు. ప్రేమించిన అమ్మాయితో దగ్గరవుతున్నాడనే కోపంతో ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి ఈ నేరానికి పాల్పడ్డాడు.
Priyanth Rao: చిత్ర పరిశ్రమలో దారుణం చోటుచేసుకొంది. నూతన నటుడు ప్రియాంత్ రావు రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో వంచించి అత్యాచారం చేశాడంటూ ప్రియాంత్‌పై జూనియర్ ఆర్టిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొన్ని నెలలుగా పరారీలో ఉన్న అతడిని పోలీసులు వెతికిపట్టుకున్నారు.
షాద్‌నగర్ రైల్వేస్టేషన్‌లో జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతి అనుమానాస్పదంగా మృతి చెందింది. కడప జిల్లాకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతి పండగకు ఊరెళ్లి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వచ్చేందుకు రైల్వేకోడూరులో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. కాచిగూడ వరకు టిక్కెట్ కొనుగోలు చేసింది. అయితే మంగళవారం ఉదయం 5:30 గంటలకు రైలు షాద్‌నగర్‌లో ఆగిన సమయంలో ఆమె రైలు దిగింది. అది కాచిగూడ కాదని తెలుసుకుని రైలు ఎక్కే క్రమంలో.. అప్పటికే రైలు కదలడంతో జారి రైలు కింద పడిపోయింది.…
సినీ పరిశ్రమలో ఎవరిని నమ్మలేము.. వారు ఎప్పుడు ఎలా మోసం చేస్తారో ఎవరికి తెలియదు. తాజాగా ఒక జూనియర్ ఆర్టిస్ట్ ని ఒక వ్యక్తి దారుణంగా మోసం చేశాడు. తనను ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి మొదటి భర్తకు విడాకులిప్పించి, తన కోరిక తీర్చుకున్నాకా వదిలేశాడని జూనియర్ ఆర్టిస్ట్ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. రహ్మత్‌నగర్‌లో నివాసముంటున్న ఒక యువతి(26) సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తోంది. ఆమెకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వారికి నాలుగేళ్ల కొడుకు…
హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో ఈవెంట్ మేనేజర్ అనురాధ ఆత్మహత్య చేసుకుంది.. ప్రేమ పేరుతో మోసపోయిన ఆమె.. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోని ఫిల్మ్‌నగర్ జ్ఞానిజైల్‌సింగ్ నగర్ బస్తీలో నివాసం ఉంటున్న ఈవెంట్ మేనేజర్ అనురాధకి.. కిరణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.. అది కాస్తా ప్రేమగా మారింది. ఎలాగైనా కిరణ్ తనను పెళ్లి చేసుకుంటాడని భావించిన ఆమె.. ఆ యువకుడితో సహజీవనం చేస్తోంది.. కానీ, ఇటీవలే మరో యువతితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం ఆమెకు…