ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా… వార్ 2. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రానున్న ఆరో సినిమాగా అనౌన్స్ అయిన వార్ 2 ఎన్టీఆర్ vs హృతిక్ రోషన్ వార్ గా ప్రమోట్ అవుతోంది. కబీర్ సింగ్ గా హ్రితిక్ రోషన్, అతనికి అపోజిట్ లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర 2 సినిమాని హోల్డ్ చేసి మరీ వార్ 2 సినిమా చేస్తున్నాడు అంటే ఈ ప్రాజెక్ట్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అనౌన్స్మెంట్ తోనే బజ్ జనరేట్ చేసిన ఈ మూవీని 2025 ఆగస్టు 14న రిలీజ్ చేయనున్నారు. వార్ 2కి నాలుగు రోజుల వీకెండ్ దొరికింది… సరిగ్గా టాక్ బయటకు వస్తే ఈ సినిమా దెబ్బకి బాక్సాఫీస్ దగ్గర ఎన్నో రికార్డులు భూస్థాపితం అవుతాయి. ఇప్పటివరకూ సౌత్ సినిమాలు నార్త్ బాక్సాఫీస్ ని కబ్జా చేసాయి కానీ ఇప్పుడు మొదటిసారి ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి వార్ 2 సినిమా సౌత్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది.
హ్రితిక్ కెరీర్ అండ్ ఎన్టీఆర్ కెరీర్ లో మాత్రమే కాదు యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ కే బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలవడం గ్యారెంటీ. ఎన్టీఆర్-హ్రితిక్ లకి ఇక షారుఖ్ అండ్ సల్మాన్ క్యామియో కూడా కలిస్తే బాక్సాఫీస్ కలెక్షన్స్ ని ఊహించడం కూడా కష్టమే. ఇదిలా ఉంటే ఈరోజు హృతిక్ రోషన్ బర్త్ డే కావడంతో… ఎన్టీఆర్ “హ్యాపీ బర్త్ డే హ్రితిక్ సర్… బిగ్ చీర్స్ టు ఫైటర్” అంటూ ట్వీట్ చేసాడు. ఈ ఒక్క ట్వీట్ తో వార్ 2 టాగ్ టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. యుద్ధభూమిలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తలపడితే ఎలా ఉంటుందో అనుకుంటూ ఫ్యాన్స్ ఎవరికి వాళ్లు హైప్ ఎక్కించుకుంటున్నారు. గతంలో ఎన్టీఆర్ బర్త్ డేకి కూడా హృతిక్ రోషన్, యుద్ధభూమిలో నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
Happy Birthday @iHrithik sir… Wishing you an amazing one and a year full of good vibes. Big cheers to Fighter!
— Jr NTR (@tarak9999) January 10, 2024