జబర్దస్త్ నటుడు, కమెడియన్ హైపర్ ఆదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక షో జరుగుతుండగానే ఆ షోను ఆపి మరీ ఆదిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు.. ఉదయం షో కు వచ్చేటప్పుడు ఒక అమ్మాయిని కారుతో గుద్ది పట్టించుకోకుండా వచ్చారని, ఆ అమ్మాయి ప్రస్తుతం చావుబతుకుల మధ్య ఉందని తెలుపుతూ ఆదిని అరెస్ట్ చేస్తున్నామని స్టేజిపై రచ్చ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఇదంతా ప్రమోషన్ కోసం అని తెలియడంతో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రస్తుతం హెయిర్ ఆది.. ప్రముఖ ఛానెల్ లో వచ్చే ఒక కామెడీ షోలో పాల్గొంటున్న విషయం విదితమే.. వారం వారం వచ్చే ఈ షోలో హైపర్ ఆది మెయిన్ కమెడియన్ అన్న సంగతి తెల్సిందే.
ఇక తాజాగా ఈ షో కు సంబంధించిన ప్రోమోను యాజమాన్యం రిలీజ్ చేసింది. ఇందులో మొదటి నుంచి వినోదాన్ని పంచిన ఆదికి ట్విస్ట్ ఇస్తున్నట్లు చివరకు పోలీసులు రంగప్రవేశం చేయడం.. అతడిని అరెస్ట్ చేస్తున్నామంటూ గోల చేయడం లాంటివి చూపించి ఈ షో పై ఆసక్తి పెంచాలని ట్రై చేశారు. ఇక పోలీసులు గా వచ్చినవారు మరింత ఓవర్ యాక్షన్ చేయడం విశేషం.. అయితే ఇంత చేసినా ఈ ప్రాంక్ అభిమానులపై ఫలించలేదు.. ఎందుకంటే ఇక్కడే వారు ఒక లాజిక్ మిస్ అయ్యారు. అస్సలు హైపర్ ఆదికి కారు డ్రైవింగే రాదు.. ఈ విషయాన్ని ఆయన ఎన్నోసార్లు బాహాటంగానే చెప్పుకొచ్చాడు. మరి కారు డ్రైవింగ్ రాని ఆది కారు ఎలా నడిపాడు.. యాక్సిడెంట్ ఎలా చేశాడు..? ఇంత చిన్న లాజిక్ ను అభిమానులు పట్టుకోలేరా..? అని నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. మీ టీఆర్పీ రేటింగ్స్ కోసం ఏదైనా చేస్తారా..? మొన్నటికి మొన్న ఇమ్మానుయేలు, పూర్ణను అసభ్యంగా తాకాడని ఆమె సీరియస్ అవ్వడం, స్టేజిపై కొట్టడం లాంటివి చూపించి రచ్చ చేశారు.. ఇక ఈ వారం ఇలా.. ఇదంతా మీ టీఆర్పీ రేటింగ్ ను పెంచుకోవడం కోసమేగా.. ఒక బ్రాండ్ ఉన్న ఛానెల్ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం అస్సలు బాగోలేదని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.