పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా లైన్‌లో పెట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘ప్రాజెక్ట్ కే’ ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా, బిగ్ బి అమితాభ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్యాన్ వరల్డ్ సబ్జెక్ట్ కావడం, ప్రభాస్‌కి ప్యాన్ ఇండియా స్టార్డమ్ ఉండడం వల్ల.. వైజయంతీ మూవీస్ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఆయా చిత్ర పరిశ్రమల్లో పేరుగాంచిన నటీనటులతో పాటు, ప్రముఖ టెక్నీషియన్స్‌ని కూడా ఈ సినిమా కోసం రంగంలోకి దింపుతున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్ శిఫు ఆష్ (choreographer Shifu Ash) ఈ చిత్రానికి పనిచేయబోతున్నాడు. కంబాట్ డ్యాన్స్ సీక్వెన్స్ కోసం, ఇతడ్ని తీసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. మూమెంట్స్ ప్రాక్టీస్, థియరీ, ఆధ్యాత్మికత, క్లిష్టమైన విద్యా విధానాన్ని అనుసంధానిస్తూ ఈ కంబాట్ డ్యాన్స్ సాగుతుంది. ఇందులో శిఫు ఆష్ నిపుణుడు. మూమెంట్ రీసెర్చర్, ఎడ్యుకేటర్, కొరియోగ్రాఫర్ అయిన శిఫు.. అంతర్జాతీయ నృత్య పరిశ్రమలో మంచి పాపులారిటీ గడించాడు. అందుకే, ఏరికోరి మరీ ఈ సినిమా కోసం అతడ్ని హైదరాబాద్‌కు పిలిపించారు. కాగా.. ప్రస్తుతం ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.