Nandamuri Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ ఏది చేస్తే అదే ట్రెండ్. ఆయన మాట మాట్లాడిన సంచలనమే.. కాలు కదిపినా సెన్సేషనే. వరుస హిట్లతో కుర్రహీరోలకు సైతం షాకిస్తున్న బాలయ్య.. ఉన్నాకొద్దీ యంగ్ హీరోలా మారిపోతున్నాడు. హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్.. ఒకటేమిటి.. అన్ని కొత్తగా మార్చేసి ఏజ్ ను తగ్గించేస్తున్నాడు. ఇకపోతే అన్ స్టాపబుల్ షోతో బాలయ్య రేంజ్ మారిపోయింది. హోస్ట్ గా బాలయ్య అదరగొట్టేసాడు. బుల్లితెర ప్రేక్షకులకు సైతం దగ్గర అయ్యాడు. ఇక తాజాగా బాలయ్య న్యూలుక్ సోషల్ మీడియానే షేక్ చేస్తోంది. ఆహా లో సూపర్ హిట్ అయిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1 ఫైనల్ లో బాలయ్య చేసిన సందడిని అభిమానులు ఇంకా మర్చిపోలేదు. హీరోయిన్లతో డ్యాన్స్ లు, సింగర్లతో జోకులు.. అబ్బో ఆ ఎపిసోడ్ మొత్తం ఫుల్ ఫన్ అని చెప్పొచ్చు.
Divyabharathi: ‘బ్యాచిలర్’ బ్యూటీ.. తన ఎత్తుపల్లాలను చూసుకోమని వదిలేసిందే
ఇక తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 మొదలయిన విషయం తెల్సిందే. థమన్, కార్తీక్, గీతామాధురి జడ్జీలుగా వ్యవహరిస్తున్న ఈ షో స్పెషల్ ఎపిసోడ్ లో బాలయ్య సందడి చేశాడు. గాలా విత్ బాలా అనే కాన్సెప్ట్ తో ఈ ఎపిసోడ్ మొదలుకానుంది. ఇక ఈ ఎపిసోడ్ లో బాలయ్య నెవ్వర్ బిఫోర్ లుక్ ఆకట్టుకొంటుంది. ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో అల్ట్రా స్టైలిష్ లుక్ తో అదరగొట్టేసాడు. మైఖేల్ జాక్సన్.. డేంజరస్ సాంగ్ లో ఉన్నట్లు బాలయ్య డ్యాన్స్ చేస్తున్న తీరు అదిరిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు బాలయ్య డేంజరస్.. ఏయ్.. టాలీవుడ్ మైఖేల్ జాక్సన్ అంటూ స్వీట్ గా సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.