టాలీవుడ్ ప్రస్తుతం టాప్ హీరోయిన్ అనగానే రష్మిక, పూజా హెగ్డే, సమంతా, శ్రీలీలా పేర్లు వినిపిస్తున్నాయి కానీ సరిగ్గా ఒక పదేళ్ల క్రితం వరకూ ప్రతి తెలుగు సినీ అభిమానికి ఉన్న ఒకేఒక్క క్రష్ ‘ఇలియానా’ మాత్రమే. నడుము అందాలతో అభిమానులని సొంతం చేసుకున్న ఈ గోవా బ్యూటీ, హాట్ నెస్ అనే పదానికే నిలువెత్తు నిదర్శనంలా ఉండేది. సినిమాపై పోస్టర్ పై ఇలియానా కనపడితే చాలు హీరో ఎవరు అనేది కూడా పట్టించుకోకుండా సినిమాకి వెళ్లిపోయే వారు అప్పటి యూత్. అంతలా తన అవర్ గ్లాస్ షేప్ తో కట్టి పడేసింది ఇలియానా డి క్రూజ్. గ్లామర్ క్వీన్ గా యూత్ హార్ట్స్ ని కొన్నేళ్ల పాటు రూల్ చేసిన ఇలియానా ఇప్పుడు సైలెంట్ అయిపొయింది. సౌత్ లో ఉన్న స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని వదిలేసి ఇలియానా బాలీవుడ్ పై మనసు పారేసుకోని నార్త్ వెళ్లిపోయింది. అక్కడ ఆశించిన స్థాయిలో సినిమాలు రాలేదు, ఇక్కడ ఉన్న స్టార్ హీరోయిన్ ఇమేజ్ పోయింది. దీంతో ఇలియానా అటు సౌత్ కి ఇటు నార్త్ కి కాకుండా అయిపొయింది.
సినిమాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో హాట్ ఫోటోస్ ని పోస్ట్ చెయ్యడానికి పరిమితం అయ్యింది ఇలియానా. ఇన్స్టా, ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా గ్లామర్ షో చేస్తున్న ఇలియానా సినిమాలు లేకపోవడంతో కంబ్యాక్ ఇవ్వడానికి ఇలియానా ఆల్బమ్ సాంగ్స్ ని నమ్ముకుంది. ఆల్బమ్ సాంగ్స్ చేసే మంజిత్ సింగ్ మరియు సుఖ్‌జిత్ సింగ్ లతో కలిసి ఇలియానా “సబ్ గజబ్” అనే ప్రైవేట్ సాంగ్ చేస్తుంది. ఈ సాంగ్ ని అనౌన్స్ చేస్తూ గతంలో ఒక పోస్టర్ కూడా బయటకి వచ్చింది. ఈ పోస్టర్ లో ఇలియానా హాట్‌నెస్ నుండి తప్పించుకునే అవకాశం లేదు అనే అంతలా ఆడియన్స్ కి అందంతో మత్తు మందు చల్లుతుంది. లేటెస్ట్ గా ‘సబ్ గజబ్’ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ అయ్యింది. ఈ ప్రైవేట్ సాంగ్ చూడడానికి వినడానికి చాలా బాగుంది. రిచ్ మేకింగ్, క్యాచీ లిరిక్స్ తో సబ్ గజబ్ సాంగ్ యుట్యూబ్ లో మంచి వ్యూవర్షిప్ రాబడుతోంది. అయితే ఈ సాంగ్ లో ఇలియానా చబ్బీగా కనిపిస్తోంది. ప్రైవేటు సాంగ్ కి కావాల్సిన గ్లామర్ షో అయితే చేసింది కానీ అసలు మనం ఒకప్పుడు చూసిన ఇలియానా ఈమెనా? అంత నాజూకు నడుము ఇప్పుడు అసలు కనిపించట్లేదు ఏంటి అని ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే. ఇలియానా లుక్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ మరీ దారుణంగా ఉందనే చెప్పాలి. ఇలానే ఉంటే ఇలియానా సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం కష్టం అనే చెప్పాలి. ఒకవేళ సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఉంటే ఇలియానా ఇమ్మిడియేట్ గా లావు తగ్గాలి లేదంటే సినిమాలని వదిలేయాలి. ఈ ఆల్బమ్ సాంగ్స్ కూడా ఇలియానాని కాపాడే అవకాశం లేదు.
https://t.co/O1nCxtb2Sd#SabGazab adventure now begins!
Do check out the hottest track of the year #SabGazab by @goldkartz & @Its_Badshah ft. @IleanaOffl is now here. @SumeetSinghM #HITEN #kkumar #FerozKhan @Unisysinfo #tanurawat #riyakishanchandani #SanaKhan #sagahits— Saga Music (@Saga_Hits) April 12, 2023