ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రాజమౌళి తర్వాత ఎవరితో సినిమా చేస్తాడా అని అనేక చర్చలు జరిగాయి. చివరికి మహేష్ బాబుతో సినిమా చేస్తాడని అధికారిక ప్రకటనలు వచ్చాయి. దీంతో ఎప్పుడెప్పుడు సినిమా మొదలవుతుందా అని అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా సైలెంట్ గా నిన్న పూజా కార్యక్రమం చేసేశారు. హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో నిన్న ఈ కార్యక్రమం అత్యంత గోప్యంగా జరిగింది. లోపలికి కార్లు వెళుతున్న వీడియోలు తప్ప రాజమౌళి ఎలాంటి ఫోటోలు, వీడియోలు బయటకు రానీయలేదు. దానికి తోడు నిన్న సాయంత్రం రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి సైతం ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు రాజమౌళి. సోషల్ మీడియాలో సినిమా గురించి చర్చ జరగడమే తప్ప ఆయన సినిమా గురించి సుమ పలకరించినా పెద్దగా మాట్లాడకుండానే స్పీచ్ ముగించారు. నిజానికి ప్రస్తుతానికి ఇండియాలో మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాలలో ఈ మహేష్ బాబు రాజమౌళి సినిమా కూడా ఒకటిగా ఉంది.
Udayabhanu : విలన్ గా రీ ఎంట్రీ ఇస్తున్న ఒకప్పటి టాప్ యాంకర్
కానీ పూజా కార్యక్రమాలు జరిగినా సినిమా గురించి పెద్దగా మాట్లాడకపోవడం రాజమౌళి ప్రమోషనల్ స్టంట్స్ లో ఒకటిగా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. సినిమా పూజకు సంబంధించిన ఫోటోలు కానీ ప్రెస్ నోట్ కానీ కూడా ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. సినిమాకి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం ఇప్పటివరకు లేదు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా విజయేంద్ర ప్రసాద్ అందించిన కథతో ఒక సినిమా చేస్తున్నారు. ఇండియానా జోన్స్ తరహా సినిమా అని విజయేంద్ర ప్రసాద్ పలు సందర్భాలలో లీక్స్ ఇవ్వటమే తప్ప ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. సోషల్ మీడియాలో మీడియాలో ఊహాగానాలు తప్ప రాజమౌళి కానీ ఆయన టీం తరఫునుంచి కానీ ఎలాంటి అప్డేట్ ఇప్పటివరకు లేదు. ఇదంతా కేవలం రాజమౌళి ప్రమోషనల్ స్ట్రాటజీ అని భావించవచ్చు. ఎప్పుడో ఆయనకు పెట్టాలనిపించినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి సినిమా గురించి వివరాలు వెల్లడిస్తారు. అప్పటివరకు ఎదురు చూడటం తప్ప సోషల్ మీడియాలో వచ్చిన లీక్స్ గురించి చర్చించుకోవడం తప్ప చేసేదేం లేదు.