HIT-3 : నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్-3. శైలేష్ కొలను డైరెక్షన్ లో వస్తున్న రెండో సీక్వెల్ ఇది. మొదటి నుంచి ఈ మూవీపై మంచి హైప్ ఉంది. నాని ఇందులో సీరియస్ పాత్రలో నటిస్తున్నాడు. ముందు నుంచే హైప్ ఉన్న ఈ సినిమా ట్రైలర్ ను నిన్న యూట్యూబ్ లో రిలీజ్ చేసినప్పటి నుంచి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. భారీ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే రాజమౌళి తీసిన త్రిబుల్ ఆర్ సినిమా రికార్డును కూడా లేపేసింది. త్రిబుల్ ఆర్ మూవీ ట్రైలర్ కు 24 గంటల్లో 20.45 మిలియన్ వ్యూస్ వచ్చాయి. నాని హిట్-3 ట్రైలర్ కు మాత్రం 24 గంటల్లోనే 21.30 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీంతో త్రిబుల్ ఆర్ రికార్డును బద్దలు కొట్టేసింది.
Read Also : Allu Arjun : అల్లు అర్జున్-అట్లీ సినిమాలో ఆ ఇద్దరు హీరోయిన్లు..?
ఇప్పటి వరకు తెలుగులో అత్యధిక వ్యూస్ పుష్ప-2 పేరిట ఉంది. ఈ మూవీ ట్రైలర్ కు 24 గంటల్లోనే 44.67 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. నాని ఇప్పటి వరకు నటించిన ఏ ట్రైలర్ కు ఈ స్థాయిలో వ్యూస్ రాలేదు. ఆల్రెడీ వచ్చిన రెండు పార్టులు మంచి హిట్ కావడంతో ఇప్పుడు మూడో పార్టుపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో నాని చాలా వైలెంటిక్ గా కనిపించబోతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు నానిని క్లాస్ పాత్రల్లో మాత్రమే చూశాం. కానీ మొదటి సారి ఇందులో ఆయన వైలెంటిక్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను మే 1న రిలీజ్ చేయబోతున్నారు.