Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ మూవీ వస్తోంది. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ దీన్ని రూ.800 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ మూవీ అనౌన్స్ మెంట్ వేరే లెవల్లో నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేనట్టు చర్చలు జరిపిన వీడియోతో ప్రకటించారు. అల్లు అర్జున్, అట్లీ అమెరికా వెళ్లి అక్కడున్న వీఎఫ్ ఎక్స్ కంపెనీలతో మాట్లాడిన విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. ఇదంతా చూస్తుంటే ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమా అనే కామెంట్ వినిపిస్తోంది. ఈ మూవీ గురించి ఎప్పుడూ ఏదో ఒక టాక్ వినిపిస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్లను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
Read Also : Nagashvin : ఆ మూవీ ట్రైలర్ చూసి డిప్రెషన్ లోకి వెళ్లా : నాగ్ అశ్విన్
బాలీవుడ్ భామలు జాన్వీకపూర్, దిశాపటానీలను తీసుకుంటున్నారంట. ఇప్పటికే వారితో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరికీ అటు బాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ ఉంది. అన్ని భాషల్లో వీరికి ఫ్యాన్స్ ఉన్నారు. పైగా ఇద్దరూ అత్యంత హాట్ హీరోయిన్స్. అందుకే వీరిద్దరినీ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం మిగతా నటీనటులను కూడా తీసుకుంటున్నారంట. ఇందులో హాలీవుడ్ స్టార్లు కూడా ఉంటారనే ప్రచారం జరుగుతోంది. కానీ దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీన్ని సైన్స్ ఫిక్షన్ మూవీగా తీసుకొస్తున్నారని అంటున్నారు.