Heroine laya re entry with Nithin Thammudu Movie: హీరోయిన్ గా ఒకప్పుడు అనేక తెలుగు సినిమాల్లో నటించి ఓన్లీ హీరోయిన్ అని ముద్ర వేసుకున్న లయ వివాహం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది. తన సుదీర్ఘ కెరియర్లో మొత్తంగా 30 నుంచి 40 సినిమాలలో ఆమె నటించింది. చివరిగా బ్రహ్మ లోకం టూ యమలోకం వయా భూలోకం అనే సినిమాలో ఆదిపరాశక్తి పాత్రలో కనిపించి ఆ తర్వాత పూర్తిగా సినిమాలకి దూరమై పోయింది. ఇక గత ఏడాది అమెరికా నుంచి హైదరాబాద్ దిగిన ఆమె వరుస ఇంటర్వ్యూలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇస్తూ వెళ్లడంతో ఆమె రీ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తోంది అనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.
ఉస్తాద్ నుంచి వీరమల్లు దాకా: అమెజాన్ లో రిలీజ్ కానున్న తెలుగు బడా సినిమాలివే
ఇక ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఇప్పుడు ఆమె నిజంగానే సినీ రంగ ప్రవేశానికి లయ సిద్ధమైంది. ఈ మేరకు అనూహ్యంగా అధికారిక ప్రకటన కూడా వెలువడింది. నితిన్ హీరోగా సప్తమి గౌడ హీరోయిన్ గా తమ్ముడు అనే సినిమా తెరకెక్కింది. దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో లయ, నితిన్ కి అక్క పాత్రలో నటిస్తుందని కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ ముంబై ఈవెంట్ లో సినిమా యూనిట్ అధికారికంగా ధ్రువీకరించింది. నితిన్ అక్కగా లయ నటిస్తుందని క్లారిటీ ఇవ్వలేదు కానీ ఈ సినిమాలో లయ నటిస్తుందని ప్రకటించడంతో దాదాపుగా ఆమె నితిన్ అక్క పాత్రలో నటించడం ఖాయం అయిపోయినట్లే.