టాలీవుడ్ యంగ్ హీరో గోపీచంద్ ప్రేక్షకులతో ఇటీవలే “సీటిమార్” వేయించాడు. ప్రస్తుతం ఈ హీరో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సిద్ధమైపోయాడు. దర్శకుడు శ్రీవాస్ తో మూడవసారి ఓ మూవీ చేయడానికి రెడీ అయిపోయాడు. తాత్కాలికంగా “గోపీచంద్ 30” అనే టైటిల్ తో పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ ను డిసెంబర్ 2021లోనే లాంచ్ చేశారు. అయితే కరోనా కారణంగా ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న చిత్రబృందం ఇప్పుడు సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో డింపుల్ హయాతి కథానాయికగా నటిస్తుండగా, ఓ సీనియర్ హీరోయిన్ కూడా భాగం కానుందని ప్రకటిస్తూ తాజా అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
Read Also : Isha Koppikar : ఆ హీరో ఒంటరిగా కలవమన్నాడు… కుదరదు అన్నందుకే అలా…
తాజాగా ఈ సినిమా షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యింది. ఈ షెడ్యూల్‌లో కీలక తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్. ఇందులో సీనియర్ నటి ఖుష్బూ కూడా కీలకపాత్రను పోషించనుంది. ఇదే విషయాన్నీ ప్రకటిస్తూ మేకర్స్ ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.