చిత్ర పరిశ్రమలో నిర్మాత బెల్లంకొండ సురేష్ పై ఫైనాన్షియర్ శరణ్ చీటింగ్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి తన వద్ద సినిమాకోసమని రూ. 85 లక్షలు అప్పుగా తీసుకొని.. తిరిగి ఇవ్వమంటే చంపేస్తామని బెదిరిస్తునట్లు అతడు ఫిర్యాదు లో తెలిపాడు. ఇక నేడు బెల్లంకొండ సురేష్ ఈ కేసుపై స్పందిస్తూ తనను బ్యాడ్ చేయడానికే ఇలాంటి ఆరోపణలు… నా పంచ ప్రాణాలైన పిల్లల జోలికి వచ్చారు… శరణ్ పై పరువు నష్టం దావా వేస్తా, లీగల్ గా ఎదుర్కొంటా.. అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక తాజాగా శరణ్ ఎన్టీవీ తో మాట్లాడుతూ.. ” బెల్లంకొండ సురేష్ ది మాది ఒకే ఊరు.. అతని మీద నేనెందుకు తప్పుడు ఆరోపణలు చేస్తాను. మొదట పన్నెండు కోట్లతో శ్రీనివాస్ తో సినిమా చేయడానికి సురేష్ ను అప్రోచ్ అయ్యాను. అప్పుడు సురేష్ నాకు గోపిచంద్ మలినేని, చోటా కె నాయుడు, లక్ష్మీ ప్రొడక్షన్స్ లతో పాటు మరికొన్ని మరికొన్ని అకౌంట్స్ పంపించాడు. వారికి నేను నగదు బదిలీ చేశాను. బెల్లంకొండ సురేష్ చెబితేనే ఈ అకౌంట్ ల్లోకి డబ్బులు పంపించాను. లేకపోతే వాళ్ళకు డబ్బులు పంపించాల్సినవసరం నాకు లేదు.
డబ్బు పంపిన కొన్నిరోజుల తరువాత సినిమా బడ్జెట్ ని 12 కోట్లు నుండి 25 కోట్లకు పెంచాడు. దీంతో నాకు అనుమానం వచ్చి నా డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగాను. అంతకుముందు కూడా సురేష్ అర్ధరాత్రి ఫోన్ చేసి నిర్మాత దానయ్య కు డబ్బులు ఇవ్వాలని ఆంట్ వెంటనే పంపాను. ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే నన్ను బెదిరిస్తున్నాడు. నా వెనుక రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పుకొస్తున్నారు. కానీ, నా వెనుక అలాంటివారు లేరు.. మాది బిజినెస్ చేసే కుటుంబం. సురేష్ తీసుకున్న డబ్బులు ఇవ్వక పోగా నన్ను చంపుతానని బెదిరించాడు.. అందుకే కోర్టును ఆశ్రయించాను. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. సురేష్ పెద్ద మోసగాడు, ఇలా ఎంతో మందిని మోసం చేశాడు.. అతని పై పీడి యాక్ట్ పెట్టాలి..” అంటూ తెలిపారు. ప్రస్తుతం ఈ వివాదం అంతకంతకు ముదురుతోంది. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.