Faria Abdullah Marriage News: హైదరాబాద్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా జాతి రత్నాల సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. ఆ సినిమాలో ఆమె నటించిన చిట్టి అనే పాత్ర తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ జాతి రత్నాలు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు భారీ కలెక్షన్లు కూడా రాబట్టింది. ఈ సినిమాలో చిట్టి అనే పాత్రలో ఫరియా నవీన్ పోలిశెట్టి పాత్రకు హీరోయిన్ నటించింది. ఈ సినిమా తర్వాత ఆమె చాలా సినిమాలలో కనిపించింది. బంగార్రాజు సినిమాలో ఒక అతిధి పాత్రలో నటించింది. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, రావణాసుర సినిమాలలో హీరోయిన్ గా నటించింది. కానీ ఆ రెండు సినిమాలు దారుణమైన డిజాస్టర్ రిజల్ట్స్ అందుకోవడంతో ఆమెకి ఒక సినిమాలో రావేమో అనుకున్నారు కానీ ఇప్పుడు అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ఆ ఒక్కటి అడక్కు సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
Pawan kalyan: ఎంపీగా.. ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్ పోటీ..! క్లారిటీ ఇచ్చిన జనసేనాని
ఇది కాకుండా మరొక తమిళ సినిమాలో కూడా నటిస్తుంది. అయితే అసలు సంగతి ఏమిటంటే ఆమె త్వరలో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైనట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నన్ను పెళ్లి చేసుకునేది తన చిన్ననాటి స్నేహితుడిని అని ప్రచారం జరుగుతుంది, మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే అతను సినీ పరిశ్రమ మీద ఆసక్తి ఉండి ప్రస్తుతం షార్ట్ ఫిలింస్ లో హీరోగా నటిస్తున్నారని అంటున్నారు. ఇది నిజమో కాదో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వీరి ప్రేమకు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే, కాక పెళ్లి చేసుకోవడానికి కూడా అంగీకారం తెలపడంతో ఈ ఏడాది పెళ్లి పీటలు ఇంకెందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.