Venkatesh Second Daughter Haya Vahini Marriage: టాలీవుడ్ ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ అంటే తన అభిమానులకే కాక సాధారణ సినిమా ప్రేక్షకులకు కూడా ఎంతో అభిమానం. ఎలాంటి రిమార్క్ లేకుండా, వివాదాలు లేకుండా 37 సంవత్సరాల నుంచి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించారు. తన నటన ద్వారా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో వెంకీ మామగా ఆయన కొలువు తీరారు. ఇక వెంకటేశ్ ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. రామానాయుడు కుమారుడు వెంకటేశ్, నీరజ రెడ్డి దంపతులకు నలుగురు పిల్లలు. ఆశ్రిత, హయ వాహిని, భావనతో పాటు వారికి కుమారుడు అర్జున్ ఉన్నారు. పెద్ద కుమార్తె ఆశ్రిత పెళ్లి 2019లో జరగగా ఆమె ఒక ఫుడ్ వ్లాగర్ గా ఉన్నారు.
Theatrical Movies : శుక్రవారం రిలీజ్ కాబోతున్న సినిమాలు ఇవే..
ఇక వెంకటేష్ రెండో కుమార్తె హయవాహిని నిశ్చితార్థం గత ఏడాది దసరా అనంతరం సైలంట్గా జరిగింది. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుమారుడయిన డాక్టర్ తో వెంకటేశ్ స్వగృహంలోనే ఈ వేడుకను నిర్వహించారు. ఈ ఏడాది ఈ జంట పెళ్లి జరగనున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇక ఆ ప్రచారానికి తగ్గట్టుగానే వీరి వివాహానికి రంగం సిద్ధం అవుతోంది.. వెంకటేష్ దగ్గుబాటి రెండవ కుమార్తె, హయ వాహిని దగ్గుబాటి, వైద్య కుటుంబం నుంచి వచ్చి స్వయంగా డాక్టర్ అయిన విజయవాడకు చెందిన వరుడిని వివాహం చేసుకోబోతోంది. రామానాయుడు స్టూడియోస్‌లో స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి వేడుక జరుగుతోందని తెలుస్తోంది. ఇక ఎప్పుడు జరగనుంది అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ ఈ నెలలోనే అనే ప్రచారం అయితే జరుగుతోంది.