Korean superstar Ma Dong-seok to play an antagonist in Prabhas’s Spirit: ఇటీవలే కల్కి 28 98 సినిమాతో హిట్టు కొట్టాడు. ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ఈ సినిమాని అశ్విని దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 950 కోట్ల రూపాయలు కలెక్షన్లు కాబట్టి వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్లు దిశగా దూసుకుపోతోంది. అయితే ఈ సమయంలో ప్రభాస్ -సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తెరకెక్కబోయే స్పిరిట్ అనే సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన చర్చ టాలీవుడ్ వర్గాల్లో మొదలైంది. అదేంటంటే ఈ సినిమాలో సౌత్ కొరియన్ యాక్టర్ ఒకరు నటిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రభాస్ టీంని సంప్రదించే ప్రయత్నం చేయగా స్పిరిట్ సినిమాకి సంబంధించి ప్రభాస్ మినహా ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదని చెప్పుకొచ్చారు.
Free Sand Policy: ఉచిత ఇసుకపై విధివిధానాలు ఖరారు.. ఉత్తర్వులు విడుదల
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ అని తేల్చేశారు. నిజానికి ఈ సినిమాకి చాలా సమయమే ఉంది. ఇప్పటికీ ఇంకా ఏమీ ఫైనల్ చేయలేదు. అయితే నిజంగా ఆయన ఈ సినిమాలో నటించినా ఆశ్చర్యం లేదు కానీ ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం మంచిది కాదు అని చెప్పినట్లుగా తెలుస్తోంది. సౌత్ కొరియన్ -అమెరికన్ యాక్టర్ గా పేరు ఉన్న మా డాంగ్ సియోక్ కొన్ని డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగువారికి సైతం దగ్గరయ్యాడు. ప్రభాస్ కటౌట్ కి తగ్గ కటౌట్ అని భావిస్తూ కొంతమంది అభిమానులు ప్రభాస్కి ఇతనికి మధ్య ఒక ఫైట్ పడితే చూడాలని కామెంట్లు చేయడంతో అక్కడ మొదలైన ఈ ప్రచారం ఇప్పుడు ఇంకెక్కడికో వెళ్ళిపోయింది. మరి ఈ విషయాన్ని సందీప్ రెడ్డి వంగ ఎంతవరకు కన్సిడర్ చేస్తాడు అనేది చూడాలి.