Free Sand Policy: గత ప్రభుత్వంలోని ఇసుక విధానాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు సర్కార్.. 2019, 2021 ఏడాదిల్లో గత ప్రభుత్వం ఇచ్చిన రెండు ఇసుక పాలసీలను రద్దు చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.. మరోవైపు.. ఉచిత ఇసుకపై విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో విడుదల చేసింది.. 2024 కొత్త ఇసుక విధానాన్ని రూపొందించేంత వరకు అమలు చేయాల్సిన కొత్త మార్గదర్శకాల జారీ చేసింది.. రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని తాజా జీవోలో పేర్కొంది. వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఇసుక సరఫరాపై మార్గదర్శకాల విడుదల చేశారు.. ఇసుక తవ్వకాల నిమిత్తం జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది.. జిల్లా ఇసుక కమిటీల్లో జిల్లా ఎస్పీ, జేసీ సహా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు ఉండాలని.. జిల్లాల్లోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఇసుక కమిటీలకు సూచించింది ప్రభుత్వం.
Read Also: Minister Seethakka: సహించేది లేదు.. సోషల్ మీడియా ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం
ఇక, 49 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఇసుక రాష్ట్రంలోని వివిధ స్టాక్ పాయింట్లల్లో అందుబాటులో ఉందని పేర్కొంది ఏపీ ప్రభుత్వం.. రిజర్వాయర్లు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో డి-సిల్టేషన్ ప్రక్రియకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.. డి-సిల్టేషన్ ప్రక్రియ ఎక్కడెక్కడ చేపట్టాలనే అంశాలపై నిర్ణయం తీసుకోనున్నాయి జిల్లా స్థాయి కమిటీలు. ఇసుక లోడింగ్, రవాణ ఛార్జీలను నిర్దారించే బాధ్యతను జిల్లా కమిటీకి అప్పగించింది. స్టాక్ పాయింట్ల వద్ద లోడింగ్, రవాణ ఛార్జీల చెల్లింపులను కేవలం డిజిటల్ విధానం ద్వారా జరపాలని స్పష్టం చేసింది ప్రభుత్వం.. ఇసుకను తిరిగి విక్రయించినా.. ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు ఉంటాయన్న హెచ్చరించింది. భవన నిర్మాణం మినహా ఉచిత ఇసుకను మరే ఇతర అవసరాలకు వినియోగించొద్దని స్పష్టం చేసింది. ఇసుక అక్రమ రవాణ చేపడితే పెనాల్టీలను నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం.