JailerFirstSingle: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో తమన్నా, రమ్యకృష్ణ, మోహన్ లాల్, సునీల్, యోగిబాబు, జాకీ ష్రాఫ్ లాంటి స్టార్లందరూ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. వా నువ్వు కావాలయ్యా.. కావాలయ్యా అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఎప్పటిలానే అనిరుధ్ రవిచంద్రన్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. తమన్నా ఈ సాంగ్ లో ఆడిపాడింది. సాంగ్ మొత్తం అమ్మడు అందాల ఆరబోతతో నింపేశారు.
Bro First Single: ‘బ్రో’.. మార్కండేయ వస్తున్నాడట.. రెడీనా
తమిళ్, తెలుగు కలగలిపిన లిరిక్స్ తో పార్టీ సాంగ్ లా కంపోజ్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. అరుణ్ రాజా కామరాజ్ ఈ సాంగ్ కు లిరిక్స్ అందివ్వగా.. శిల్పా రావు తన హస్కీ వాయిస్ తో అదరగొట్టింది. ఇక సాంగ్ కోసం చాలా ఖర్చుపెట్టినట్లు కనిపిస్తుంది. సెట్స్ చాలా కలర్ ఫుల్ గా కనిపిస్తున్నాయి. సాంగ్ కు హైలైట్ గా తమన్నా నిలవగా.. చివర్లో రజినీ స్టెప్స్ తో అలరించాడు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో రజినీకాంత్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.