మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు ఇప్పుడు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్నేళ్లు మలయాళ భాషలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి.. ఇప్పుడు తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. చివరగా ‘లక్కీ భాస్కర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.గత ఏడాది విడుదలైన బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ చిత్రాలలో ఇది ఒకటి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఏకంగా ప్రభాస్ ‘కల్కి’ చిత్రాన్ని బీట్ చేస్తూ అరుదైన ఘనత సాధించింది. ఇక ఇప్పుడు మరోసారి తెలుగులో గ్రామీణ నేపథ్యంలో మరో ప్రాజెక్ట్ తో రాబోతున్నాడు.
Also Read: Nayanthara: వాళ్ళ కారణంగా నయనతార నరకం చూసింది.. నిజాలు బయటపెట్టిన నాగార్జున !
గతేడాది దుల్కర్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఆకాశంలో ఒక తార’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ మరియు స్వప్న సినిమాస్ బ్యానర్ పై స్వప్నదత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీలో ముందుగా సాయి పల్లవి హీరోయిన్ గా అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వలన సాయి పల్లవి ప్లేస్ లో స్వస్తిక అనే కథానాయికని తీసుకున్నట్టు తెలుస్తోంది. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు మేకర్స్. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టనున్నారు గతంలో నారా రోహిత్ తో సావిత్రి అనే సినిమాను డైరెక్ట్ చేసిన పవన్ సాదినేని’ ఆకాశంలో ఒక తార’ కు దర్శకత్వం వహిస్తున్నాడు.