Divyansha Kaushik Gives Clarity On Marriage Rumours With Naga Chaitanya: కొన్ని గాసిప్స్ ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో తెలీదు కానీ, అవి ఉన్నట్లుండి సినీ పరిశ్రమలో అలజడులు సృష్టిస్తాయి. ఇప్పుడు నాగచైతన్యపై కూడా అలాంటి రూమర్లే వస్తున్నాయి. సమంతతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి.. చైతూ పర్సనల్ లైఫ్‌కి సంబంధించి ఏదో ఒక గాసిప్ గుప్పుమంటూనే ఉంది. ఇతడు శోభితా దూళిపాళతో డేటింగ్ చేస్తున్నాడంటూ.. ఆమధ్య తెగ ప్రచారం జరిగింది. ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యారని జోరుగా ప్రచారం జరిగింది. ఇంతలోనే మరో రూమర్ పుట్టుకొచ్చేసింది. తాను మజిలీ సినిమాలో కలిసి నటించిన దివ్యాంశ కౌశిక్‌తో చైతూ ప్రేమాయణం నడుపుతున్నాడన్నదే ఆ రూమర్ సారాంశం. చైతూ, దివ్యాంశ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారని, త్వరలోనే పెళ్లి బంధంతో ఒక్కటి కూడా కాబోతున్నారని వార్తలు ఊపందుకున్నాయి. అంతేకాదు.. రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో దివ్యాంశకు ఆఫర్ రావడానికి కారణం కూడా చైతూనే అని వార్తలొచ్చాయి.
Vatti Vasanth Kumar: మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ కన్నుమూత
అయితే.. ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తాజాగా దివ్యాంశ స్పష్టం చేసింది. తనకు చై అంటే ఇష్టమేనంటూ, అతనితో పెళ్లి చేసుకోబోతున్న వార్తల్లో మాత్రం వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది. అలాగే.. ఆ సినిమా ఛాన్స్ రావడంలో చైతూ హస్తం లేదని తెలిపింది. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆ వ్యాఖ్యలు చేసింది. ‘‘నాగచైతన్య అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ చైతూ. అతడు చూడటానికి చాలా బాగుంటాడు. అతనిపై నాకు క్రష్ కూడా ఉంది. కానీ.. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. రామారావు ఆన్ డ్యూటీలో నాకు ఛాన్స్ రావడానికి చైతూనే కారణమంటూ వచ్చిన రూమర్స్‌లో కూడా నిజం లేదు’’ అంటూ ఆ బ్యూటీ చెప్పుకొచ్చింది. సో.. దివ్యాంశతో చైతూ ప్రేమలో ఉన్నాడన్న ప్రచారానికి ఇక్కడితో చెక్ పడినట్టే!
Ram Charan: వారికి రామ్ చరణ్ వార్నింగ్.. మా నాన్న జోలికి వస్తే.. ఊరుకోను ?