Dil Raju Speech at Family Star Pre Release Event: హైదరాబాద్ నరసింహారెడ్డి కాలేజీలో ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి హాజరైన నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాలేజీలోకి వస్తున్నప్పుడు వైబ్ చాలా బాగుందని అంటూనే తమకు పరీక్షలు జరుగుతున్నాయని మనం 48 గంటల్లో ఆ పరీక్ష రిజల్ట్ ఏంటో తెలుస్తుందని చెప్పుకొచ్చాడు. 48 గంటల్లో ఫ్యామిలీ స్టార్ మీ ముందుకు రాబోతున్నాడని అన్నారు. అయితే స్టూడెంట్స్ విజయ్ దేవరకొండ మాట్లాడాలని అరుస్తున్న సమయంలో నేను మాట్లాడిన తర్వాతే విజయ్ మాట్లాడతాడు అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఇంతలో విజయ్ దేవరకొండ పక్కకు వచ్చి దిల్ మామ మాట్లాడకపోతే ఎలా ఆయన మాట్లాడిన తర్వాతే మనం మాట్లాడాలి అనడంతో నన్ను ఆఖరికి దిల్ మామని చేసేసారా అంటూ దిల్ రాజు వ్యాఖ్యానించారు.
Parasuram: దేవరకొండ ఇప్పటివరకు ఒక లెక్క.. ఈ సినిమా తర్వాత ఒక లెక్క!
దేవరకొండతో పరశురాం ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్ తో ఈ సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమాని మీరు సకుటుంబ సమేతంగా ఈ సమ్మర్ లో ఎంజాయ్ చేస్తారన్నారు. సినిమాకి విజయ్ క్యారెక్టర్జేషన్ బాగా స్పెషల్ సినిమాలో నవ్విస్తాడు, దెబ్బలు కొడతాడు, అమ్మాయి చేత దెబ్బలు తింటాడు. పరశురాం విజయ్ క్యారెక్టర్ని కాస్త స్పెషల్ గా డిజైన్ చేశారు. ముఖ్యంగా అమ్మాయిలకైతే ఈ గోవర్ధన్ పిచ్చ పిచ్చగా నచ్చేస్తాడు. గోపీ సుందర్ ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అది మీరు థియేటర్లో కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. పాటలు కూడా ఇప్పటికే దాదాపు అన్ని బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి. మీ అందరూ ఈ సినిమా చూడాలి, ఈ సినిమా చూశాక చాలా మంది ఫ్యామిలీ స్టార్స్ అవుతారు. సినిమా చూశాక మీరు ఫ్యామిలీస్ గురించి ఆలోచించడం మొదలు పెడతారు అని అన్నారు.