Parasuram Petla Speech at Family Star Pre Release Event: పరశురాం పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో జరుగుతోంది. ఇక ఈ ఈవెంట్ కి హాజరైన దర్శకుడు పరశురాం మాట్లాడుతూ ముందుగా ఈవెంట్ కి హాజరైన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే ఒక అందమైన ఎమోషన్, చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో విజయ్ క్యారెక్టర్, మృణాల్ క్యారెక్టర్ కనెక్ట్ అవుతాయి. గీత గోవిందం లాంటి సినిమా చేసిన తర్వాత మేమిద్దరం సినిమా చేయాలంటే ఒక మంచి ఎమోషన్ కావాలి, ఆ ఎమోషన్స్ సెట్ అయ్యేవరకు నేను కంగారు పడలేదు. ఒకసారి మా కాంబినేషన్ వ్యాల్యూ తెలిసిన తర్వాత ఒక అందమైన కథ మెదిలిన తర్వాతే విజయ్ దేవరకొండ ని కలిసి ఈ సినిమాని పట్టాలెక్కించడం జరిగింది.
Family Star: ఫ్యామిలీ స్టార్ ఈవెంటుకి బైకుపై వెళ్లిన విజయ్, మృణాల్
ఈ కథ విన్న తర్వాత విజయ్ వెంటనే ఒప్పుకుని ఆ క్యారెక్టర్ని ఫోన్ చేసుకున్న విధానం మీ అందరిని ఆకట్టుకుంటుంది. కచ్చితంగా చెబుతున్నాను ఇప్పటివరకు ఒక లెక్క ఈ సినిమా తర్వాత ఒక లెక్క అనేట్టుగా విజయ్ దేవరకొండ నటించాడు. ఈ గోవర్ధన్ క్యారెక్టర్ గురించి చాలా రోజులు మాట్లాడుకుంటాం. ఈ క్యారెక్టర్ సినిమాలో క్యారెక్టర్ కాదు నిజజీవితంలో మన దగ్గరి బంధువుల్లో ఎవరో ఒకరిని చూసే ఉంటాం. ఈ సినిమాలో మృణాల్ ను కన్ఫర్మ్ చేశాక పాత్రలో ఇమిడిపోవడానికి చాలా కష్టపడింది. విజయ్, మృణాల్ పెయిర్ గురించి కూడా చాలా మాట్లాడుకుంటారు. నేను పరుగు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశా అప్పుడే దిల్ రాజు గారితో సినిమా చేయాలి అనుకునే వాడిని. ఇప్పుడు ఆ అవకాశం రావడం నా అదృష్టం. దాన్ని వృధా చేసుకోకుండా ప్రాణం పెట్టి పని చేశాను. ఈ సినిమా మీకు మంచి మెమోరీస్ ఇస్తుంది అని అన్నారు.