వాల్తేరు వీరయ్యతో తన అభిమాన హీరో మెగాస్టార్‌కు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చాడు డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర ఆలియాస్ బాబీ. రవితేజతో తన పవర్ ఏంటో చూపించిన బాబీ, ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో జై లవ కుశ చేశాడు. ఈ సినిమా బాబీని స్టార్ డైరెక్టర్‌ని చేసింది అందుకే ఏకంగా చిరంజీవితో ఛాన్స్ కొట్టేశాడు. ఇటీవల వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో వింటేజ్ మెగాస్టార్‌ని చూపించి సక్సెస్ అయ్యాడు బాబీ. మరి బాబీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? హీరో ఎవరు? ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఊహకందని విధంగా ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంతో బాబీ ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌తో ‘వారిసు’ సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు నిర్మాత దిల్ రాజు. ఇక ఇప్పుడు రజనీకాంత్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తలైవాకు సాలిడ్ కథ నేరేట్ చేశారని.. రజనీకాంత్ కూడా ఓకే చెప్పారని తెలుస్తోంది. అంతేకాదు సూపర్ స్టార్‌కు అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో డైరెక్టర్ ఎవరనేది గత కొంతరోజులుగా సస్పెన్స్‌గా మారింది. అయితే ఇప్పుడు ఆ సస్పెన్స్ ని బ్రేక్ చేస్తూ ఊహించని విధంగా బాబీ పేరు తెరపైకొచ్చింది. ఇది నిజంగా షాకింగ్ అప్డేట్ అనే చెప్పాలి.
మెగాస్టార్ తర్వాత తెలుగు స్టార్ హీరోతో సినిమా చేస్తాడనుకున్న బాబీ, ఏకంగా ఇండియన్ సూపర్ స్టార్‌తో సినిమా చేసే ఛాన్స్ అంటే.. మామూలు విషయం కాదు. అయితే ఈ మాట ఎంతవరకూ నిజం అనే విషయంలో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకూ రూమర్ గానే చూడాలి. ఎందుకంటే రజినీకాంత్ తో సినిమా చెయ్యడానికి కోలీవుడ్ బడా బ్యానర్స్ అండ్ డైరెక్టర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్, లైకా ప్రొడక్షన్స్ లాంటి బ్యానర్స్ రజినీ ఊ అంటే చాలు అడ్వాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి, వీటిలో ఒక బ్యానర్ కి ఆల్రెడీ రజినీ కమిట్ అయ్యి ఉన్నాడు అని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇక దర్శకుల విషయానికి వస్తే లోకేష్ కనగరాజ్, కార్తిక్ సుబ్బరాజ్, ప్రదీప్ రంగనాధన్ లాంటి దర్శకులు రజినీతో సినిమా చెయ్యడానికి క్యులో ఉన్నారు. వీరిని కాదని రజినీకాంత్, బాబీతో సినిమా చేస్తాడా? ఒకవేళ చేస్తే ఇప్పటికే మూడు, నాలుగు సినిమాలకి కమిటయ్యి ఉన్న రజినీకాంత్, బాబీ ప్రాజెక్ట్ ని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు అనేది ప్రశ్నార్ధకమే. అసలు రజనీకాంత్, దిల్ రాజు, బాబి కాంబినేషన్ నిజమేనా? లేదా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఆ తర్వాతే ఈ కలయికలో సినిమా ఎప్పుడు అనే లెక్కలు వేసుకోవడం బెటర్.