యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటేనే యాక్టింగ్ పవర్ హౌజ్ లాంటి వాడు. అలాంటి హీరో ఒక పవర్ ఫుల్ సూపర్ హీరోగా కనిపిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఎన్టీఆర్ ని అలా చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే ఏమో మార్వెల్ నుంచి అలాంటి ప్రాజెక్ట్ ఒకటి బయటకి రావొచ్చేమో అనే మాట వినిపిస్తోంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీముడు పాత్రలో అద్భుతంగా నటించిన ఎన్టీఆర్, ఇంటర్వెల్ బ్లాక్ లో జంతువులతో కలిసి దాడి చేశాడు. ఏ మార్వెల్ సూపర్ హీరో సినిమాలోని సీన్ కి ఏమాత్రం తక్కువ కానీ ఈ సీన్ కి వెస్ట్రన్ మూవీ లవర్స్ ఫిదా అవుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా అనగానే చాలామందికి ఎన్టీఆర్ ఇంటర్వెల్ సీన్ ముందు గుర్తొస్తుంది.
ఎన్టీఆర్ ని జక్కన్న ఆ రేంజులో చూపించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ ని నెక్స్ట్ రేంజులో చూపించడానికి మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేస్తుంది అనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ని సొంతం చేసుకుంది. ఈ అవార్డ్స్ ప్రీషోలో ఒక రిపోర్టర్ ఎన్టీఆర్ ని మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లోకి ఎంటర్ అవుతున్నారా అంటే వెయిటింగ్ ఫర్ ఏ కాల్ అన్నట్లు తారక్ ఆన్సర్ ఇచ్చాడు. అయితే కొంతమంది మాత్రం ఎన్టీఆర్, బ్లాక్ పాంథర్ పాత్రలో చెయ్యబోతున్నాడు అంటున్నారు.
చాడ్విక్ బోస్మేన్ చనిపోయిన తర్వాత బ్లాక్ పాంథర్ క్యారెక్టర్ ని అంత పర్ఫెక్ట్ సెట్ అయ్యే హీరో దొరకలేదు. రీసెంట్ గా బ్లాక్ పాంథర్ సీరీస్ నుంచి ‘వాకండా ఫరెవర్’ సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఇంటర్నేషనల్ రీచ్ ఉన్న ఈ బ్లాక్ పాంథర్ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతాడు. ఆ పాత్రలోని ఎమోషన్స్ ఇండియన్ ఎమోషన్స్ కి చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి బ్లాక్ పాంథర్ క్యారెక్టర్ ఎన్టీఆర్ చేస్తే బాగుంటుంది అని కొందరు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. హాలీవుడ్ సినీ అభిమానులు, కొంతమంది ఫిల్మ్ మేకర్స్ కూడా ఎన్టీఆర్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లోకి ఎంటర్ అయ్యే విషయం గురించి కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో తనకి ”టోనీ స్టార్క్” పాత్ర అంటే చాలా ఇష్టం అని ఎన్టీఆర్ చెప్పాడు.