Deepika Padukone : సినిమా ఇండస్ట్రీలో అవమానాలకు కొదువే ఉండదు. ఇప్పుడు స్టార్లుగా ఉన్న వారంతా ఒకప్పుడు విమర్శలు ఎదుర్కున్న వారే. అందులోనూ హీరో, హీరోయిన్లకు బాడీ షేమింగ్ అనేది ఓ పెద్ద శత్రువు. స్టార్ హీరోయిన్లకు సైతం ఈ బాడీ షేమింగ్ అనేది తప్పలేదు. కొందరు తర్వాత కాలంలో వాటిని బయట పెడుతూ ఉంటారు. స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె కూడా బాడీ షేమింగ్ ను ఎదుర్కుందంట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పింది. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో.. ఆమె రంగు గురించి చాలా మంది కామెంట్లు చేసేవారంట. ఇండస్ట్రీలోని కొందరు డైరెక్టర్లు, సినిమాటోగ్రాఫర్లకు తన ఫొటోలు పంపిస్తే.. మగాడిలా ఉందంటూ చెప్పారంట. తన ముందే అలాంటి కామెంట్లు చేసేసరికి తట్టుకోలేకపోయానని చెప్పింది దీపిక.
Read Also : Meena : ఆ ఫ్లైట్ లో సౌందర్యతో పాటు నేనూ వెళ్లాలి.. మీనా కామెంట్స్
ఇండస్ట్రీలో టాప్ పొజీషన్ కు ఎదిగి తనను విమర్శించిన వారి నోర్లకు జవాబు చెప్పాలనుకున్నట్టు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది దీపిక. రంగు అనేది ఫైనల్ కాదని.. మన ట్యాలెంట్ మాత్రమే మనకు ఫైనల్ అంటూ చెప్పింది దీపిక. ఆమె చేసిన ఈ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాళ్లందరికీ చెక్ పెట్టే విధంగానే ఆమె కెరీర్ లో టాప్ పొజీషన్ కు ఎదిగిందంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. దీపికకు కూతురు పుట్టినా సరే ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాల్లో నటిస్తోంది. ఇప్పుడు ఆమె అల్లు అర్జున్-అట్లీ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే కల్కి-2 సినిమాలోనూ నటించబోతోంది.
Read Also : Mirai : వాయిస్ ఓవర్ తోనే సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రభాస్..