Mirai : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ బేస్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమాల్లోనే కాదు.. బయట ఎక్కడ కనిపించినా సరే ఆ ఫొటోలు సోషల్ మీడియాలో తుఫాన్ లా దూసుకుపోతాయి. అలాంటి ప్రభాస్ ఓ సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తే కథ మామూలుగా ఉండదు కదా. సాధారణంగా ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వడు. కానీ మిరాయ్ సినిమాకు ఇచ్చాడు. ప్రభాస్ వాయిస్ తోనే కథ స్టార్ట్ అవుతుంది. ఆ విషయాన్ని మూవీ టీమ్ దాచిపెట్టింది. రిలీజ్ కు కొన్ని గంటల ముందు చెప్పింది. చాలా మంది థియేటర్లలోనే ఆ విషయం తెలుసుకుని పిచ్చెక్కిపోయారు. ప్రభాస్ వాయిస్ వినేసరికి థియేటర్లలో రచ్చ మామూలుగా లేదు. కనిపించకపోయినా.. ప్రభాస్ వాయిస్ వినిపించేసరికి ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. దెబ్బకు మిరాయ్ సినిమా అంటే ప్రభాస్ వాయిస్ అనేంతగా ట్రెండ్ అయిపోతోంది ఈ వార్త.
Read Also : Tamannah : అతినికే లిప్ ఇస్తానని చెప్పిన తమన్నా.. నిజంగానే ఇచ్చేసిందే..
పాపం తేజసజ్జా ఎంతో కష్టపడి సినిమా తీశాడు. మంచు మనోజ్ విలనిజంతో అదరగొట్టాడు. అయినా సరే ప్రభాస్ పేరు వినిపించినంతగా వాళ్ల పేర్లు వినిపించట్లేదంటే.. ప్రభాస్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్ ఎలాంటిదో అర్థం అవుతోంది. కేవలం వాయిస్ ఓవర్ ఇస్తేనే సోషల్ మీడియా ఊగిపోతోంది. అలాంటిది ప్రభాస్ గనక ఇందులో కనిపించి ఉంటే కథ ఇంకెలా ఉండేదో. మొత్తానికి వాయిస్ ఓవర్ తోనే మిరాయ్ క్రెడిట్ ను కొట్టేస్తున్నాడు ప్రభాస్. ప్రభాస్ వాయిస్ వల్లే మూవీ కథకు వెయిట్ వచ్చిందని తేజ స్వయంగా చెప్పడంతో రెబల్ స్టార్ పేరు సోషల్ మీడియాను ఊపేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభాస్ పేరు.. ఆయన సినిమాల్లో కాకుండా వేరే సినిమా విషయంలో వినిపిస్తోంది. ఇక రాబోయే అక్టోబర్ లో ప్రభాస్ నుంచి వరుస సినిమా అప్డట్లే ఉన్నాయి.
Read Also : Meena : విడాకులు తీసుకున్న వాళ్లందరితో నాకు పెళ్లి చేసేశారు..