Meena : దివంగత స్టార్ హీరోయిన్ సౌందర్య ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఓ ఎన్నికల ప్రచారం కోసం వెళ్తున్న టైమ్ లో జరిగిన ప్రమాదంలో ఆమె కన్నుమూశారు. సౌత్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న సౌందర్య.. క్రేజ్ ఉన్నప్పుడే మరణించారు. అయితే ఆమె ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి తాజాగా సీనియర్ హీరోయిన్ మీనా స్పందించింది. జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా ప్రోగ్రామ్ కు ఆమె గెస్ట్ గా వచ్చారు. ఇందులో ఆమె మాట్లాడుతూ.. నేను పాప పుట్టిన రెండేళ్లకే సినిమాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. దృశ్యం సినిమాను నన్ను దృష్టిలో పెట్టుకుని మలయాళంలో రాసుకున్నారు. వేరే వాళ్లతో చేయలేమని చెప్పడంతో చివరకు నేనే చేయాల్సి వచ్చింది.
Read Also : Mirai : వాయిస్ ఓవర్ తోనే సోషల్ మీడియా షేక్ చేస్తున్న ప్రభాస్..
నా జీవితంలో ఎన్నో అనుకోని సంఘటనలు ఉన్నాయి. సినిమాలు కూడా అలాగే వచ్చాయి. దివంగత హీరోయిన్ సౌందర్య వెళ్లిన ఫ్లైట్ లోనే నేను కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సి ఉంది. కానీ నేను షూటింగ్ వల్ల నేను వెళ్లలేకపోయా. ఆ ఫ్లైట్ కు అలా జరిగిందని తెలుసుకుని చాలా బాధపడ్డా. నేను వెళ్లలేనందుకు సంతోషపడ్డాను. కానీ సౌందర్య వెళ్లిందని తెలుసుకుని చాలా బాధపడ్డాను అంటూ ఎమోషనల్ అయింది మీనా. తన భర్త చనిపోయే టైమ్ లో కూడా అస్సలు ఊహించలేదని తెలిపింది. అనుకోకుండా అలా జరిగేసరికి కోలుకోవడానికి నాకు టైమ్ పట్టింది. కానీ మంచి ప్రయత్నం ఎప్పుడూ మనల్ని ముందుకు నడిపిస్తుందనే నమ్మకం నాకు ఉంది. అదే నన్ను మళ్లీ సినిమాల్లో రాణించేలా చేస్తోంది అంటూ తెలిపింది మీనా.
Read Also : Tamannah : అతినికే లిప్ లాక్ ఇస్తానని చెప్పిన తమన్నా.. నిజంగానే ఇచ్చేసిందే..