Dasara Director Srikanth Odela Ties Knot: దసరా సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ ఓదెల సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడు. మే 31వ తేదీన కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖనిలో అతని వివాహం ఘనంగా జరిగింది. ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అయినప్పటికీ.. తెరవెనుక ఓ ఇంట్రెస్టింగ్ కథ దాగి ఉంది. శ్రీకాంత్‌ని తమ స్నేహితుల్లో ఒకడైన శివ సోదరిని పెళ్లి చేసుకోవాలని కొందరు ఫ్రెండ్స్ సూచించారు. శివకి అభ్యంతరం లేకపోతే, తాను అతని సోదరిని పెళ్లి చేసుకుంటానని శ్రీకాంత్ బదులిచ్చాడు. అప్పుడు హరి అనే స్నేహితుడు.. ఆ ఇరువురి కుటుంబ పెద్దలతో మాట్లాడి, పెళ్లిని ఫిక్స్ చేయించారు. ఆ విధంగా శ్రీకాంత్ ఓ ఇంటివాడు అయ్యాడు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ ఈ పెళ్లికి హాజరు అవ్వాలని అనుకున్నారు కానీ.. వాళ్లిద్దరు తమతమ ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటంతో హాజరు కాలేకపోయారు. అయితే.. ట్విటర్ మాధ్యమంగా శ్రీకాంత్‌కి నాని శుభాకాంక్షలు తెలియజేశాడు. మన శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నాడని, అందరూ ఈ కొత్త జంటను దీవించాలని ట్వీట్ చేస్తూ.. శ్రీకాంత్ పెళ్లి ఫోటోను షేర్ చేశాడు. ఈ జంట చూడముచ్చటగా ఉండటంతో.. అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Viral news : రైల్వే ట్రాక్ పై డ్యాన్స్ అదరగొట్టిన యువతి.. దారుణంగా నెటిజన్స్ ట్రోల్స్..
కాగా.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ‘దసరా’ సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి కీలక పాత్ర పోషించాడు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈ చిత్రం అలరించడంతో.. బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ కొనసాగించింది. ఫలితంగా.. ఇది రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి, నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే.. శ్రీకాంత్ ఓదెల తదుపరి సినిమా ఏంటి? ఏ జోనర్‌లో ఉంటుంది? ఎవరితో చేయబోతున్నాడు? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.