సంపత్ నంది టీమ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ “సింబా ఫారెస్ట్ మ్యాన్” ప్రారంభమైంది. తాజాగా మేకర్స్ ఒక కాన్సెప్చువల్ వీడియోను విడుదల చేసారు. దీనిని బయోలాజికల్ మెమరీ ఆధారిత సైన్స్ ఫిక్షన్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్ గా సంపత్ నంది రాశారు. ఇది ఆసక్తికరంగా ఉండడమే కాకుండా అంచనాలనూ పెంచేసింది. ఈ వీడియో చూస్తుంటే సినిమా అడవి సంరక్షణ నేపథ్యంలో తెరకెక్కనుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కొంతమంది వ్యక్తులు చెట్లను నరికి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు కనిపిస్తోంది.
Read Also : “ఎస్ఆర్ కళ్యాణమండపం” డిజిటల్ ప్రీమియర్ ఎప్పుడంటే ?
అడవులను నాశనం చేసే వారి హింసాత్మక చర్యలకు హీరో కూడా హింసాత్మకంగానే సమాధానం చెప్పాడు. ఈ చిత్రాన్ని సంపత్ నంది, రాజేందర్ రెడ్డి డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంపత్ నంది రచన సహకారం అందించగా మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కృష్ణ ప్రసాద్ ఫోటోగ్రఫీ డైరెక్టర్, సంగీతం కృష్ణ సౌరభ్ అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.