రాజమౌళి మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” కోసం కథ రాసిన ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఓ విషయం చెప్పి సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నారు. “ఆర్ఆర్ఆర్”లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక లుక్ లో కన్పించనున్నారట. అది చూస్తే మెగా అభిమానులు సంతోషపడడం ఖాయం అంటున్నారు. ఇంతకీ ఆ లుక్ ఏమిటంటే చరణ్ ఈ చిత్రంలో పోలీస్ గెటప్ లో కన్పించబోతున్నాడట. “ఆర్‌ఆర్‌ఆర్‌లో చరణ్ పోలీసు అవతారం వెనుక ఒక క్లిష్టమైన కథ ఉంది. ఇది తెరపై ఆనందకరమైన ఆశ్చర్యం కలిగిస్తుంది” అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.
Read Also : రాజ్ కుంద్రా చేసిన పనికి శిక్ష ఏంటో తెలుసా ?
విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రం విడుదలకు ఇంకా చాలా రోజులు ఉండగానే రామ్ చరణ్ పోలీసు లోక్ గురించి రివీల్ చేసి హైప్ పెంచేయడమే కాకుండా అందరి దృష్టిని ఆకర్షించారు. చరణ్ చివరిగా విడుదలైన ‘సీతారామ రాజు’ టీజర్‌లో పోలీసు అధికారిగా కనిపించడం తెలిసిందే. కాగా చరణ్, తారక్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేక ప్రమోషనల్ సాంగ్ షూటింగ్‌లో ఉన్నారు. తుది షెడ్యూల్ కోసం వారు త్వరలో జార్జియాకు వెళ్లనున్నారు.