రాజ్ కుంద్రా చేసిన పనికి శిక్ష ఏంటో తెలుసా ?

ఇండియాలో అశ్లీల వీడియోలను చూడడం, షేర్ చేయడం లేదా డౌన్లోడ్ చేసుకోవడం నేరం. తాజాగా బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న రాజ్ కుంద్రా కేసుపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త, సెలెబ్రిటీ అయిన అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజ్ ను ఈనెల 23 వరకు రిమాండ్ కు తరలించాల్సిందిగా కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కుంద్రాపై భారత శిక్షాస్మృతిలోని 420 (మోసం), 34 (సాధారణ ఉద్దేశం), 292, 293 (అశ్లీల మరియు అసభ్య ప్రకటనలు ప్రదర్శించడం), ఐటీ చట్టంలోని 67, 67ఏ సెక్షన్లు (మహిళా అసభ్య ప్రాతినిథ్యం) కింద కేసులు నమోదు చేశారు.

Read Also : బాలకృష్ణ వ్యాఖ్యలపై ట్రోలింగ్

అయితే ఆయన చేసిన నేరానికి మూడు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇండియాలో అశ్లీలతను నియంత్రించేందుకు ఇండియన్ పీనల్ కోడ్ కింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకొచ్చారు. ఇన్ డీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్స్ యాక్ట్ అండ్ యంగ్ పర్సన్యాక్ట్ ఐపిసి ఐటి యాక్ట్ 2000 చట్టాన్ని అశ్లీల వీడియోలపై విధించారు. మరోవైపు నటీమణులు అతను అశ్లీల వీడియోలు చేయమంటూ ఒత్తిడి చేశారని చెప్తున్నారు. దీంతో ఆయనకు గట్టిగానే శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-