తమిళ సినిమా సూపర్‌స్టార్ తలపతి విజయ్ తన చివరి చిత్రంగా ప్రకటించిన ‘జన నాయగన్’ సినిమా గురించి అభిమానుల్లో ఉత్కంఠ రోజురోజుకు పెరిగిపోతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా, జనవరి 9, 2026న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అని తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. విజయ్ కెరీర్‌లో ఇది 69వ చిత్రం కావడంతో పాటు, ఆయన రాజకీయ రంగంలోకి అడుగుపెట్టే ముందు చివరి సినిమాగా ఉండనుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘జన నాయగన్’ అనే టైటిల్‌తోనే ఈ సినిమా విజయ్‌కి, ఆయన అభిమానులకు ఎంతో ప్రత్యేకమైనదని అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు హెచ్. వినోత్ రూపొందిస్తున్నారు. గతంలో విజయ్‌తో ‘బీస్ట్’, ‘మాస్టర్’ వంటి బ్లాక్‌బస్టర్‌లు తీసిన దర్శకులతో పోలిస్తే, హెచ్. వినోత్ సామాజిక సందేశాలతో కూడిన సినిమాలకు పేరున్న దర్శకుడు కావడం ఈ సినిమాకి మరో హైలైట్.
Yash : నన్ను పొగరుబోతు అని ముద్ర వేశారు.. యష్ ఎమోషనల్
విజయ్ రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) స్థాపించి, 2026 ఎన్నికల్లో పోటీ చేయాలని ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో, ఈ సినిమా ఆయన రాజకీయ ఆలోచనలను ప్రతిబింబించే అవకాశం ఉందని అభిమానులు ఊహిస్తున్నారు. ‘జన నాయగన్’ని కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తున్నట్లు సమాచారం, అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అలాగే, బాబీ డియోల్, ప్రకాశ్ రాజ్, వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారని టాక్. సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగు భగవంత్ కేసరి సినిమాకి రీమేక్ అనే ప్రచారం జరుగుతున్నా ఈ విషయం గురించి అధికారిక ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది.