తమిళ నటుడు విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .విభిన్నమైన సినిమాలలో నటించి విజయ్ ఆంటోనీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాడు .విజయ్ ఆంటోనీ బిచ్చగాడు సినిమాతో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాడు .రీసెంట్ గా బిచ్చగాడు 2 సినిమాతో విజయ్ ఆంటోనీ మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.తాజాగా విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన మూవీ లవ్‌గురు. లవ్ మరియు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను స్వయంగా విజయ్ ఆంటోనీ నిర్మించారు .ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు..లవ్‌గురు సినిమాలో విజయ్ ఆంటోనీ సరసన మృణాళిని రవి హీరోయిన్‌గా నటించింది.అయితే విజయ్ ఆంటోనీ నుంచి ఎక్కువగా యాక్షన్ థ్రిల్లర్ సినిమాలే వచ్చేవి. తాజాగా వాటికి భిన్నంగా పూర్తిగా రొమాంటిక్ లవ్‌స్టోరీగా లవ్‌గురు సినిమా రూపొందింది.
విజయ్ ఆంటోనీ ఈ మూవీలో కొత్తగా కనిపించాడు. కానీ స్టోరీలో కొత్తదనం లేకపోవడంతో ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.లవ్‌గురు మూవీలో యోగిబాబు మరియు వీటీవీ గణేష్ కీలక పాత్రలు పోషించారు.ఈ సినిమాకు భరత్ ధన్ శేఖర్ మ్యూజిక్ అందించాడు. ఇదిలా ఉంటే లవ్ గురు సినిమా త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం . మే 3 నుంచి లవ్ గురు సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే తమిళంలో ఈ మూవీ రోమియో అనే టైటిల్ తో రిలీజైంది. ఈ మూవీ తమిళ వెర్షన్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్ చివరి వారం లవ్ గురు సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.