Usha Parinayam Operation Ravan Toofan Viraaji Movies Releasing on August 2nd: తెలుగు సినిమాలు చాలా ఆగస్టు 2న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటి దాకా నాలుగు సినిమాలను ఆ రోజు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయా సినిమాల విషయానికి వస్తే నువ్వే కావాలి,మన్మథుడు, మల్లీశ్వరి వంటి ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రాలు చేసి ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ భాస్కర్ దర్శకత్వంలో మరో సరికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలి ఎంటర్ టైనర్ రాబోతుంది. `ఉషా పరిణయం` అనే టైటిల్ తో మరో ఫ్యామిలి ఎంటర్టైనర్ ను విడుదలకు సిద్ధం చేశారు. తన తనయుడు శ్రీ కమల్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా తాన్వి ఆకాంక్ష అనే తెలుగమ్మాయిన పరిచయం కాబోతుంది. రక్షిత్ అట్లూరి హీరోగా రాధికా శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా “ఆపరేషన్ రావణ్” చిత్రాన్ని ఆగస్టు 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
Bahishkarana : పుష్పా.. ఏంటి యవ్వారం ఏదో తేడాగా ఉంది!!
ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య తెలుగు, తమిళ, హిందీ బాషల్లో రూపొందిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ఆపరేషన్ రావణ్” సినిమా రిలీజ్ డేట్ తో పాటు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. హీరో విజయ్ ఆంటోని తాజా చిత్రం తుఫాన్ కూడా ఆగస్టు 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్ బోరా, డి.లలిత, బి. ప్రదీప్, పంకజ్ బోరా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ పై విజయ్ ఆంటోని హీరోగా నటించిన “రాఘవన్”, “హిత్య” చిత్రాలు విడుదలయ్యాయి. ఈ సంస్థ నుండి వచ్చిన తాజా చిత్రం “తుఫాను” ఈ చిత్రం పూర్తిగా పోయేటిక్ యాక్షన్ ఫిల్మ్ జానర్ అని అంటున్నారు. మరోపక్క మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా బ్యానర్ పై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం “విరాజి” ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. మొత్తంగా చూస్తే రక్షిత్ అట్లూరి ఆపరేషన్ రావణ్, విజయ్ ఆంటోనీ తుఫాన్, వరుణ్ సందేశ్ విరాజి, శ్రీ కమల్ ఉషా పరిణయం సినిమాలు అదే రోజు రిలీజ్ అవుతున్నాయి.